26న తెలంగాణ బంద్, Telangana bandh on 26 November
రైతు వ్యతిరేక మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని , Telangana bandh on 26 November విద్యుత్ చట్ట సరవరణ బిల్లును ఉప సంహరించుకోవాలని , పంటల మద్దతు ధరల గ్యారంటి చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26 న తలపెట్టిన తెలంగాణ గ్రామీణ బందను విజయవంతం చేయాలని ఎఐకెఎస్ సిసి డిమాండ్ చేసింది . ఈ మేరకు హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మంఖూం భవన్లో ఎఐకెఎస్ సిసి రాష్ట్ర కన్వీనర్లు పశ్వపద్మ , వేము లపల్లి వెంకట్రామయ్య , టి.సాగర్ , పల్లపు ఉపేందర్ రెడ్డిలు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిం చారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి పిలుపులో భాగంగా నవంబర్ 26 న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని , 27 న నిరసన ప్రదర్శలు , రాస్తారోకో తదితర కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రైతాంగం నిర్వహిస్తుందన్నారు .
జూన్ 5 నుంచి నేటి వరకు రైతాంగం నిరవధికంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా చేస్తుంద న్నారు . అయినప్పటికి నరేంద్ర మోడి ప్రభు త్వం స్పందించకుండా ఉద్యమాన్ని అణచడా నికి అనేక కుట్రలు చేస్తుందన్నారు . నవంబర్ 26 న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి హర్యానా రాష్ట్రంలో ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేయడం లాంటి నిరంకుశ చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శిం చారు . న్యాయబద్ధమైన రైతాంగ డిమాండ్లను సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామ న్నారు . భవిష్యత్ లో ఉద్యమాన్ని కొనసాగిస్తామ న్నారు . ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి , 200 రోజులు పనిదినాలు కల్పించాలన్నారు . రోజు కూలి రూ .600 ఇవ్వాలన్నారు . ఆమార భద్రత చట్టాన్ని , ప్రజా పంపిణీ వ్యవ స్థను పటిష్టంగా అమలు చేయాలన్నారు .
Telangana bandh on 26 November ::
నిత్యా వసర వస్తువుల ధరలను నియంత్రించాల న్నారు . రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేయకెఉండా రైతులకు రక్షణ కల్పించే సంస్థలుగా చట్టాలు చేసి , తీర్చిదిద్దాలన్నారు . వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని పంటలకు నష్టపరి హారం చెల్లించాలన్నారు . అన్ని పంటలను కనీస మద్ద ధరలకు కొనుగోలు చేయాలన్నారు . సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ .2,500 ఇవ్వాలని కోరారు . నవంబర్ 26 ట్రేడ్ యూని యన్ జాతీయ సమ్మెకు సంపూర్ణంగా రైతు సంఘాల తరపున మద్దతు ఇస్తామన్నారు . కార్మికవర్గం వ్యవసాయ కార్మిక సంఘాలు , ఇతర ప్రజా సంఘాలు తెలంగాణ గ్రామీణ బందు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు .
గ్రామీణ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్ద తివ్వాలని కోరారు . టిఆర్ఎస్ , కాంగ్రెస్‌లు రైతుల పోరాటానికి మద్దతునిచ్చి , ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు . ఇప్పటికే రాష్ట్ర స్థాయిల సదస్సులు , జాతాలు , పాదయాత్రలు , మూల మలుపు బహిరంగ సభలు నిర్వహిస్తూ , మోడి కార్పొరేట్ అనుకూల , రైతు , వినియోగదారుల , నిరుపేద ప్రజల వ్యతిరేక విధానాలను విస్తృ తంగా ప్రచారం చేయడం జరిగిందని తెలి పారు . ప్రజలందరూ గ్రామీణ బంద్ లో పాల్గొని , విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు .