సోషల్ మీడియా లో రైతు ఆత్మహత్య వైరల్, farmer suicide in Telangana state
farmer suicide in Telangana state “ సారూ .. దండం సారు .. కెసిఆర్ ముఖ్య మంత్రి సారు .. మా వరి చేల పరిస్థితి ఎట్లా ఉందో చూడు ( వర్షాలకు దెబ్బతిన్న వరిని చేతిలో పట్టుకొని చూపిస్తూ … ) మాది యాదా ద్రిభువనగిరి జిల్లా , భువనగిరి మండలం సూరేపల్లి గ్రామం . వానపడి మొత్తం కొట్టుకు పోయి ఆగమైనయ్ . మొత్తం మందులు డూప్లికేట్ ఇచ్చిండ్రు సార్ . ఏ మందు కొట్టిన పంట అక్కరొస్తలేదు . వానలకు రోడ్లు కొట్టు కుపోయినయ్ . అన్ని పంటలు కొట్టుకుపో యినయ్ . మమ్మల్ని ఇక్కడ దేకేటోళ్లే లేరు . మాసర్పంచ్ గాని , మా ఎంఎల్‌ఎ గాని మమ్మల్ని తొంగి చూసినోళ్లే లేరు . ఓట్లప్పుడే వచ్చిండ్రు . ఓట్లు పడ్డాక మళ్లీ ఎవరు రాలేదు సారు . మ పరిస్థితి గిట్లుంది . మేము ఎట్లా బతుకాలి సారు . రైతులను కాపాడు సారు ” అంటూ సిఎం కెసిఆర్‌కు తన గోడును వీడియో ద్వారా మొరపెట్టుకున్న సూరేపల్లికి చెందిన రైతు సామ కాంతారెడి పంట నష్టపరిహారం రాలేదన్న మనస్థాపానికి గురై బుధవారం రాత్రి తనువు చాలించాడు .
ఈ విషాదఘటన యాదాద్రి జిల్లాలో కలకలం సృష్టిస్తున్నది . కాంతారెడ్డికి 10 ఎకరాల భూమి ఉంది . తన భూమితో పాటు తన సోదరు డికి చెందిన నాలుగు ఎకరాల భూమిని కౌలు తీసుకున్నాడు . మొత్తం 14 ఎక రాల్లో వరి సాగు చేశాడు . ఆకాల వర్షాల వల్ల మూసీ ఉగ్రరూపం దాల్చ డంతో ఆ మూసీ తీరం వెంట ఉన్న కాంతారెడ్డి వరి పొలం పూర్తిగా కొట్టుకు పోయింది . ఆరుగాలం పండించిన పంట చేతికి రాకపోవడంతో అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు . పంట నష్టం అంచనాకు వచ్చిన అధి కారులకు దెబ్బతిన్న తన పంట పొలంతో పాటు నీట మునిగి కాలిపోయిన రెండు బోర్లను కూడా చూయించాడు . పంట నష్టం జరిగి నెల రోజులు కావ స్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాకపోవడంతో పలు మార్లు అధి కారుల చుట్టూ తిరిగి వేసారిపోయిన రైతు కాంతారెడ్డి మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినాడు . కాంతారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన తరువాత ఆయన సీఎం కేసీఆర్ కు తన గోడును విన్న విస్తూ తీయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేపుతున్నది .
farmer suicide in Telangana state
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం బాదిత కుటంబాన్ని పరమార్శించాడు . ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు . కుటుంబానికి తన వంతుగా రూ .50 వేల నగదు ఆర్ధిక సాయం అందించారు . ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే .. : కుంభం ఆకాల వర్షాల కారణంగా మూసీ వరదల్లో పంట మొత్తం కొట్టుకు పోయిందని తన గోడును వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా సీఎంకు విన్నవించిన ప్రయోజనం లేకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రైతు కాంతారెడి మృతి ప్రభుత్వ హత్యగా తాను భావిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు . వీడియోలో ఎమ్మెల్యే , సర్పంచ్ పట్టించుకోవడం లేదని స్పష్టంగా చెప్పడం లోనే ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదన్నారు . నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి మంత్రి కేటీఆర్ ఈ వీడియోపై ఎందుకు స్పందించలేదో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .
రైతుల బలవన్మరణాలకు కారణమవుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు కుటుంబాల ఉసురు తగిలి కొట్టుకుపోతుందన్నారు . చేతికొచ్చిన పంటను తన్నుకుపోయిన వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు . ఆయన వెంట పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్ , ఎంపిటిసి లక్ష్మ నానాయక్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోట పెద్ద స్వామి , జిల్లా నాయకులు వల్లందాసు ఆదినారయణ , బీసుకుంట్ల సత్యనారయణ , చిక్కుల వెంకటేశ్ , పాశం శివానంద్ , నుచ్చు నాగయ్య తదితరులు ఉన్నారు .