12 కోట్ల మంది మోదీపై చార్జ్ షిట్ వేయాలి, KTR comments on BJP
గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే చార్మినార్ , గోల్కొండ , జిహెచ్ఎం సిలని అమ్ముకుంటారని టిఆర్ఎస్ KTR comments on BJP వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కెటి.రామారావు అన్నారు . “ మేక్ ఇన్ ఇండియా ” అనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ నినాదం ప్రస్తుతం “ బెబో ఇండి యా’గా మారిందని ఎద్దేవా చేశారు . లాభాల్లో ఉన్న కేంద్ర సంస్థలను కూడా మోడీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందన్నారు . టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదే కర్ ఆవిష్కరించిన చార్జ్ షీట్ ఒక గోబెల్స్ డైరీగా ఉన్నదన్నారు .
బిజెపి నేతలు గోబెలకు కజిన్ బ్రదర్స్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు . హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ తమకు ఎంఐఎంకు మధ్యనే ఉంటుందని , మొదటి స్థానంలో టిఆర్ఎస్ , రెండవ స్థానంలో ఎంఐఎం , మూడవ స్థానంలో ఎవరుంటారనే విషయమై మిగతా పార్టీలు తేల్చుకోవాల న్నారు . ప్రధాని మోడీది బేచో ఇండియా అయితే , తమది బచావో ఇండియా అని అన్నారు . కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారని , టిఆర్ ఎస్ , ఎంఐఎం సర్కార్ అంటూ అర్ధసత్యాలు మాట్లాడరన్నారు . తమ ప్రభుత్వంలో ఎవరూ భాగస్వాముల లేరన్నారు . బిజెపి వ్యాఖ్యలు చూస్తుంటేవారు ముస్లింల పట్ల ఎంత వ్యతిరేక తతో ఉన్నారో అర్థమవుతోందన్నారు . .జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటు వాద పార్టీ పిడిపితో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజం కాదా ? ప్రశ్నించారు . టిఆర్ఎస్ పై చార్జిషీట్ వేయడాన్ని ఆయన ఖండించారు . కొత్తగా ఏర్పడిన తెలం గాణ రాష్ట్రం ఆరేళ్లలో ప్రగతి పథాన దూసుకు పోతున్నదని , అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని , అందుకు తమపై చార్జిషీట్ వేయాలా అని ప్రశ్నించారు .
KTR comments on BJP ::
హైదరాబాద్ నగ రానికి రాజ్యాంగ బద్దంగా కాకుండా అద నంగా ఒక్క పైసా నైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విడుదల చేసిందా ? దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మిగతా కేంద్ర మంత్రులు సూటిగా సుత్తి లేకుండా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు . .లాభాల్లో ఉన్న కేంద్ర సంస్థ లను అమ్ముతున్నందుకు , ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీనిచ్చిన నరేంద్రమోడీ ప్రభు త్వంపైన ఆరేళ్ల కాలంలో 12 కోట్ల మంది నిరు ద్యోగులు చార్జ్ షిట్ వేయాల్సి ఉంటుందన్నారు . రూ . 20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కేంద్ర మంత్రులకు తెలుసా : కెటిఆర్ ఉద్దీపాన ప్యాకేజీ కింద రూ . 20 లక్షల కోట్లు ప్రకటించారని , 20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కేంద్ర మంత్రలుకు తెలుసా అని కెటిఆర్ ఎద్దేవా చేశారు . ఈ ప్యాకేజీతో ఎవరిని ఉద్దరించారన్నారు . హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ను రద్దు చేశారని , బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలే దని , .కొత్త వ్యవసాయ బిల్లులు తెచ్చినందుకు తెలంగాణ రైతులు బిజెపిపై చార్జ్ షీట్ వేయాల న్నారు . వరద సాయం కింద రూ . 25 వేల ప్యాకేజీ ఇస్తానని చెబుతున్నారని , తాము చేసిన వరద సాయం జాబితా పంపిస్తామని , వారికి రూ .25 వేల సాయం చేస్తే తాను వారు చెప్పిన ట్టుగా వింటానని అన్నారు . ఎ’ఎ ప్రభుత్వం అధాని , అంబానీ కుటుంబం కోసమే పనిచే స్తోందన్నారు .
రాష్ట్రానికి రావాల్సిన హక్కు అడి గితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనది వేర్పాటు వాదం అంటున్నారన్నారు . కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎటితో చిరువ్యాపాల నడ్డి విరు గుతోందని , నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడ్డారని , చిరు వ్యాపారుల పొట్టకొట్టార న్నారు . బిజెపి కేంద్ర ప్రభుత్వ దివాళ కోరుత నంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని , వెనుక బడిందని , అసమర్ద ఆర్థిక విధానాలను అవలం భించారని కెటిఆర్ ఆరోపించారు .