వైద్యం కోసం తల్లిని భుజాన వేసుకున్న కొడుకు, Son carried his mother
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని డాక్టరుకు చూపించాలని Son carried his mother కొడుకు తహతహలాడాడు తన చేతులపై ఎత్తుకొని మోసుకొంటూ పట్టణం అంతా కలియతిరిగాడు . ఆఖరుకు ఎలాగో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లాడు .
వివరాలిలావున్నాయి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన రామప్ప అనే వ్యక్తి తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుండగా వాహన సౌకర్యం లేకున్నా అతి కష్టం మీద 15 కిలో మీటర్ల దూరంలో గల కళ్యాణదుర్గం పట్టణానికి గురువారం తన తల్లితో పాటు చేరుకొన్నాడు . ఆసుపత్రులన్నీ కరోనా చికిత్సకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి ఇతర రకాల రోగులను పట్టించుకోవడం లేదు .
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందదని తెలుసుకొన్న ఆయన, Son carried his mother అయిన తల్లిని మోసు కొంటూ పట్టణంలోని అన్ని ప్రవేటు ఆసుప్రతుల డాక్టర్ల వద్ద కు తిరిగాడు . కాగా కరోనా ప్రబావంతో డాక్టర్లు ఎవరూ అందు బాటు లేక వైద్యం లభించలేదు . ఆటోల లాంటి వాహనాలేవీ ప్రయాణానికి అందుబాటులో లేక తల్లిని మోసిమోసి ఎర్రటి ఎండలో నీరసించి పోయాడు .
విధిలేక తల్లిని ప్రభుత్వ ఆసుపత్రికే తరలించి , ఇక నావల్ల కాదని మీరే వైద్యం చేయండని డాక్టర్లను ప్రాధేయ పడ్డాడు . డాక్టర్లు మానవత్వంతో స్పందించి చికిత్స అందించాక తల్లితో పాటు తన గ్రామానికి బయలు దేరి వెళ్లిపోయాడు . లాక్డౌన్ ప్రభావంతో నిత్యం ఇలాంటి సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి . ప్రభుత్వం ఇలాంటి రోగుల కోసం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనావుంది .