మనసు చాటుకున్న MP బండి సంజయ్, MP Bandi Sanjay donate money
కరోనాపై పోరులో భాగంగా పీఎం కేర్ కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ. కోటి MP Bandi Sanjay donate money కేటాయించడంతోపాటు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు . ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
తన పిలుపు మేరకు రాష్ట్ర భాజపా కార్యకర్తలు పీఎం కేర్ కు భారీగా విరాళాలు అందించినట్లు తెలిపారు . కరోనా నివారణ చర్యల్లో భాగంగా MP Bandi Sanjay donate money కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి రూ . 50 లక్షలను కేటాయించినట్లు పేర్కొన్నారు . కరోనా మహమ్మారిని తరిమేద్దాం – దేశాన్ని గెలిపిద్దాం అంటూ పీఎం కేర్స్ సహాయ నిధికి విరాళాలు అందించిన పార్టీ కార్యకర్తలకు , అభిమానులకు ఈ సందర్భంగా బండి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు . ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు భారీగా విరాళాలు అందిస్తున్నారు .
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయల చొప్పున విరాళాన్నిచెక్కుల రూపంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వనపర్తి వాసులు అందజేశారు . కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి తాము చేయూతనిస్తామంటూ వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమల సరస్వతి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ లక్ష రూపాయల చెక్కును , ఎన్‌కెఆర్ వేర్ హౌస్ తరపున లక్ష రూపాయల చెక్కును సంస్థ అధినేత కృష్ణారెడ్డి మంత్రి నిరంజన్‌రెడ్డికి అందజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు పెద్దయెత్తున స్పందనరావడం , కరోనా మహమ్మారిని పారదోలేందుకు మేమంతా ముందుంటామంటూ పెద్దసంఖ్యలో ముందుకు రావడం ప్రశంసించదగ్గ విషయమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు .