తెలంగాణలో మొదటి కరోనా మరణం, first corona death in Telangana
తెలంగాణ రాష్ట్రంలో శనివారం కొత్తగా 6 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి , ఒక వృద్ధుడు కరోనా first corona death in Telangana లక్షణాలతో మరణించారని వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రకటించారు .
ఖైరతాబాద్ కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు కొద్దిరోజులుగా అస్వస్థతతో నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడని , అయితే కరోనా లక్షణాలతో మరణించినట్లు first corona death in Telangana సందేహం రావడంతో పోస్టు మార్టం నిర్వహించినపుడు చేసిన పరీక్షల్లో అది నిజమేనని నిర్ధారణ అయిందని వెల్లడించారు .
ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు . కాగా రాష్ట్రంలో శనివారం నాటికి మొత్తం 75 కేసులు నిర్ధారణ అయ్యాయని , వీరిలో పదిమంది పూర్తిగా కోలుకున్నారని , త్వరలో వారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు .
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో పాతబస్తీకి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురికి , నాంపల్లిలో ఓ కుటుంబానికి చెందిన నలుగురికి , కుత్బుల్లా పూర్లో నలుగురితో పాటు నగరంలో మరో ఇద్దరికి వ్యాధి నిర్ధారణ అయిందని వివరించారు .
ఆ వృద్ధుడికి తోడుగా ఢిల్లీకి వెళ్లిన వ్యక్తిని , మరో ఐదుగురు వృద్ధుడి బంధువులను ప్రస్తుతం క్వారంటైన్‌కు పంపామని మంత్రి వెల్లడించారు . శనివారం ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారిలో ముగ్గురు ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ చేపట్టిన వైద్యులని , మరో ముగ్గురు ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని నగరానికి వచ్చినవారని వివరించారు .
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి , తాజా పరిస్థితులపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియా సమావేశంలో వివరించారు . అంతకుముందు ఆయన గచ్చిబౌలి స్టేడియంలో కరోనా కేంద్రం ఏర్పాటుకు అక్కడి పరిస్థితులను పరిశీలించారు.