తెలంగాణలో ఒకే రోజు 10 కరోనా కేసులు, మొత్తం 59 కేసులు, 10 +ve cases in TS
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి . శుక్రవారం ఒక్క రోజు 10 +ve cases in TS పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి . ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలోలా డౌనన్ను కొనసాగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు .
రాష్ట్రంలో ఎంతటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా 10 +ve cases in TS పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి . లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇండ్ల నుంచి బయటికి రావద్దని ప్రకటించినప్పటికీ కొందరు బయట తిరుగు తున్న నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ రాకుండా నివారించాలంటే నివారణ ఒక్కటే మార్గమని అందుకు ఎవరు కూడా గుంపులుగా తిరగకుండా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది . లాక్ డౌనను అమలు చేస్తూ ఎవరు కూడా బయట తిరగవద్దని ఇంట్లోనే ఉండాలని ప్రకటించింది .
కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్ చేశారు . మరికొందరి రెండు , మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది . ఆ అయితే కరోనా పాజిటివ్ కేసుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని సీఎం కేసీఆర్ , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు . రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల మంది వివిధ క్వారంటైన్లలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.