ఇండియాలో 716కు చేరిన కరోనా వైరస్ కేసులు, 716 corona +ve cases in India
ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు కరోనా బారినపడి విలవిలలాడుతున్నాయి . 716 corona +ve cases in India భారత్ లోనూ కరోనా కేసులు రోజు రోజుకూ విస్తృతమవుతున్నాయి . దేశంలోని 26 రాష్ట్రాలకు కోవిడ్ 19 వైరస్ సోకింది .
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన రెండోరోజు గురువారం రాత్రికి దేశంలో 716 corona +ve cases in India కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 716కు చేరుకున్నాయి . కరోనా వైరస్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 19కు చేరుకుంది . ఈ వైరస్ బారినపడినవారిలో 48మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది .
యాక్టివ్ కేసులు 598 ఉన్నాయని కేంద్రం తెలిపింది . తెలుగు రాష్ట్రాలైనా ఏపీలో 11కేసులు నమోదవగా వీరిలో ఒకరు కోలుకోవడంతో విడుదల చేశారు . తెలంగాణలో 41కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా వీరిలో ఒకరిని డిశ్చార్జ్ చేశారు . దేశవ్యాప్తంగా నమోదైన కేసులను పరిశీలిస్తే మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ 19 వైరస్ ఉదృతంగా ఉంది . మహారాష్ట్రలో 124 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . వీరిలో ఒక బాధితుడు కోలుకోగా మరో ముగ్గురు మరణించారు .
ప్రభుత్వం అత్యవసర విధులను నిర్వహిస్తున్న వారికి ఆహారాన్ని అందించే ఫుడ్ డెలివరీ బాయ్ కు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకుంటున్నట్టు తెలిపారు . కేరళలో కరోనా కేసుల సంఖ్య 126కు చేరుకోగా వీరిలో నలుగురు కోలుకున్నారు . తాజాగా 19కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు . కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటశాలల నుంచి బాధితులకు ఆహారం సరఫరా చేస్తున్నారు .
స్వీయ నిర్బంధంలో ఉన్న వలస కార్మికులకు కూడా ఆహారాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది . మధ్యప్రదేశ్ లో గురువారం కొత్తగా 5కరోనా కేసులు నమోదయ్యాయి . దీంతో మధ్యప్రదేశ్ లో కోవిడ్ బాధితుల సంఖ్య 20కు చేరుకుంది . బీహార్లో గురువారం తాజాగా మరో కరోనా వైరసీ కేసు నమోదైంది . పట్నాలోని 20 ఏళ్ల యువకుడికి కరోనా వైరసోకిందని నలంద మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ( ఎస్ఎంసీహెచ్ ) అధికారులు నిర్ధారించాడు .
కరోనా వైరస్ సోకిన యువకుడు ఇటీవల ఎటువంటి ప్రయాణాలు చేయకపోయినా కరోనాసోకిందని వారు తెలిపారు . దీంతో బీహార్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7కు చేరుకుంది . గోవాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు . మరోవైపు కోవిడ్ 19 కారణంగా కశ్మీర్లో తొలి కరోనా మరణం నమోదైంది .
One Comment