ఆత్మహత్యాయత్నం కు ఏ శిక్ష వేస్తారో తెలుసా? Punishment for suicide attempt

భారతీయ శిక్షాస్మృతి ( ఇండియన్ పీనల్ కోడ్ ) సెక్షను 309 Punishment for suicide attempt ఆత్మహత్య ప్రయత్నాన్ని నేరంగా నిర్ణయించింది . ఆత్మహత్యకు ఎలాంటి ప్రయత్నం చేసినా అది నేరమే . దానికి ఏడాది సాధారణ జైలు , జరిమానా విధించవచ్చు . 1996 లో సుప్రీంకోర్టు కేసు 946 లో ఆత్మహత్యా ప్రయత్నం రాజ్యాంగ అధికరణం 14 కి అతిక్రమణ కాదని తీర్పు ఇచ్చింది . 1860 సం || లో చేసిన ఐ.పి.సి. క్రిమినల్ చట్టం , బ్రిటీష్ వారి హయాంలోనిది . సామాజికంగా భారతదేశంలో అనేక మార్పులు కాలంతో బాటు చోటు చేసుకుంటున్నాయి .

న్యాయస్థానాలు – ముఖ్యంగా రాజ్యాంగ ధర్మాసనాలు అయిన హైకోర్టు , సుప్రీంకోర్టులు న్యాయ సూక్ష్మాల పట్ల దృష్టి పెడుతున్నాయి . ఏదైనా చట్టంలోని సెక్షను ప్రజాహితం కాని పక్షంలో రద్దు చేసే అధికారం ఉపయోగించుకుంటున్నాయి . కొద్దికాలం క్రితం స్త్రీలకి గల లైంగిక స్వేచ్ఛ గురించి చేసిన వ్యాఖ్యలో వారి అనైతిక చర్యలు నేరం కావని చెప్పటం జరిగింది . అలాగే , ఇప్పటి వరకు శిక్షార్హమైన నేరాలు ఐ.పి.సి.లో ఉన్న సెక్షన్లను రద్దు చేసింది . ఈ అధికారం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంది . చట్టంలో సవరణలే కాదు , చెల్లుబాటు అవుతుందా లేదా- అని నిర్ణయించే అధికారం కూడా సుప్రీంకోర్టుకి ఉంది .

Punishment for suicide attempt


సామాజిక అవసరాల దృష్ట్యా కొత్త చట్టాలను , ఏ అంశం మీద చేయాలో కూడా సుప్రీకోర్టు సూచిస్తుంది . ఉమ్మడి పౌరస్మృతి ( కామన్ సివిల్ కోడ్ ) త్రిపుల్ తలాక్ వంటి విషయాల మీద సుప్రీంకోర్టు చట్టాలు చేయవలసిందిగా కేంద్రానికి సూచించింది . ఆత్మహత్యను శిక్షార్హమైన నేరంగా నిర్ణయిస్తే , తొందరపడి అలాంటి ప్రయత్నాలకు పూనుకోరని చట్టనిర్మాతల ఉద్దేశం . కానీ , మరణించాలని నిర్ణయించు కున్నాక , మరింకేమీ ఆలోచించరు . ఆత్మహత్యా ప్రయత్నం విఫలమై , పట్టుబడితేనే శిక్ష . లేకపోతే లేదు . విస్తృతమైన విశ్లేషణతో ఆరోగ్యశాఖ వారు ఆత్మహత్య కోరిక మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించారు . వారికి చికిత్స అవసరమని , తద్వారా ఆత్మహత్య చేసుకునే తత్వం ( టెండెన్సీ ) సరిదిద్దగలరని భావించారు .

2010 లో 7 శాతం ఉన్న ఆత్మహత్యలు , మానసిక చికిత్స కారణంగా 5. 4 శాతానికి తగ్గాయి . 2014 లో మానసిక సమస్యల కారణంగా ఏడువేల మంది దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి . ఈ నేపథ్యంలో ప్రభుత్వం మానసిక ఆరోగ్య రక్షణ ( మెంటల్ హెల్త్ కేర్ ) బిల్లు రాజ్యసభలో ప్రవేశ పెట్టింది . 134 సవరణలతో అది ఆమోదం పొందింది . ఇందులో ఒక విశేషం ఏమిటంటే , వృద్ధులు ఒకవేళ తమకు మానసిక అనారోగ్యం కలిగితే , ఎలా చూసు కోవాలో ముందుగా సూచనలు చేసే అవకాశం ఉంది . ఈమకు తగిన చికిత్స చేయించగల వ్యక్తులను ( నామినీ ) వారు సూచించవచ్చు కూడా . ఆర్థికంగా వెనుకబడిన వారికి , దరిద్ర రేఖ దిగువున జీవించే వారికి ఉచిత వైద్య సౌకర్యాలను ఈ బిల్లులో ప్రతిపాదించారు . ఒకవేళ తెల్లకార్డు లేకపోయినా , ఆర్థికంగా శక్తిలేని వారికి ఉచిత వైద్యం లభిస్తుంది . ఏతావాతా , ఆత్మహత్యల్ని ఇటుపైన నేరంగా చూడరు . మానసిక అనారోగ్యంగా భావించి వైద్యం చేయిస్తారు . ఇది ఒక శుభ పరిణామం .

Related Articles

Back to top button