Trending

బీజేపీ టీఆర్ఎస్ మద్య రాచుకున్న పంచాయితీ, War between BJP & TRS

రామాలయ నిర్మాణం పేరుతో బిజేపి నాయకులు War between BJP & TRS కోట్లాది రూపాయల అక్రమ వసూళ్లకు పూనుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపద్యంలో బిజేపి కార్యకర్తలు హన్మకొండలోని ఆయన ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన నేపద్యంలో టిఆర్ఎస్ కార్య కర్తలు సైతం బిజేపి కార్యాలయం , నాయకుల ఇళ్లపై దాడికి పాల్పడడంతో వరంగల్ లో ఉద్రిక్తత వాతావ రణం కొనసాగుతున్నది.ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడిచేసిన వారిని పోలీసులు అరెస్టు చేయగా స్వంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇం టిపై దాడిచేసినందుకు ప్రతిగా పలుచోట్ల టిఆర్ఎస్ కార్యకర్తలు బిజేపి కార్యాలయాలు , నాయకుల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు.కాగా ఈ ఉద్రిక్తతల నేపద్యంలో అటు అధికార ఎమ్మెల్యేల ఇళ్లతో పాటు ఇటు బిజేపి నాయకుల ఇళ్లు , కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు . అవాంఛనీయ సంఘట నలు చోటు చేసుకోకుండా రోజంతా పోలీసు అధికా రులు , సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు .

కాగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటికి సోమవారం రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భా స్కర్ తదితరులు చేరుకుని పరామర్శించారు . అనం తరం ఆయన నివాసంలో విలేఖరుల సమావేశంలో మంత్రి సత్యవతి మాట్లాడుతూ బిజేపి చిల్లర రాజకీయాలు మానుకోవాలని , బండి సంజయ్ భాష మార్చు కోవాలని హితవు పలికారు.రానున్న ఎన్నికల కోసమే బిజేపి దాడులకు పాల్పడుత్నుదని అన్నారు . War between BJP & TRS నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి తెగ బడిన బిజెపి శ్రేణులపై సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు , దిష్టిబొమ్మల దగ్ధం , రాస్తారోకో లతో టిఆర్ఎస్ కార్యకర్తలు భగ్గుమన్నారు . అయో ధ్యలో రామమందిరం నిర్మాణం కోసం విహెచ్ పి ఆధ్వర్యంలో విరాళాలు సేకరించాల్సి ఉండగా బిజెపి నాయకులు , కార్యకర్తలు తమ రాజకీయ లబ్ధి కోసం విరాళాల సేకరణ భుజానికెత్తుకున్నారని , సేకరించిన మొత్తానికి లెక్కలు లేవని ఎంఎ పేర్కొనడం తప్పేలా అవుతుందని టిఆర్ఎస్ నాయకులు ప్రశ్ని స్తూ గ్రామాల్లో , మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు .

పరకాల పట్టణబంద్ కు పిలుపు నిచ్చిన పార్టీ శ్రేణులు ఉదయం నుండే ద్విచక్రవాహ నాలపై తిరుగుతూ బందను పర్యవేక్షించారు . ఆది వారం అర్థరాత్రి టిఆర్ఎస్ కార్యకర్తలు పరకాల ఎస్ బిఐ ముందున్న బిజెపి కార్యాలయానికి నిప్పంటిం చారు . సోమవారం పట్టణంలోని బిజెపి నాయకుల ఇండ్లవద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు . సం గెం , గీసుకొండ , ఆత్మకూరు , దామెర , నడికుడ మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు . బిజేపి దిష్టి బొమ్మలు దగ్ధం చేసి రాస్తారోకో నిర్వహించారు . ఎస్సీ ఎస్టీ బీసీ లను కించపర్చలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల క్షమాపణ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్షమాపణ కోరారు.హన్మ కొండలోని నివాసంలోవిలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఆదివారం జరిగిన ఓసి గర్జన సభలో తాను మాట్లాడిన మాటలు వక్రీకరించారని అన్నారు . తాను అంటే గిట్టని వారు తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని , ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ అమలుకు సంబంధించిన మాట్లాడే క్రమంలో చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారన్నారు . తాను బడుగు బలహీన వర్గాలతో స్నేహపూర్వకంగా ఉంటానని , అందరి సహకారం తనకు ఉంటుందన్నారు.తప్పుడు ప్రచారం నమ్మవ ద్దని విజ్ఞప్తి చేస్తున్నానని , తప్పుడు ప్రచారంతో ఎవరి మనసులైన నొచ్చుకుని ఉంటే మన్నించాలని కోరారు .

Related Articles

Back to top button