Trending

ఢిల్లీలో ఉగ్రవాదుల కుట్ర… Delhi bomb blast

న్యూఢిల్లీ : Delhi bomb blast దేశ రాజధానిలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీ పంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న బాంబు పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు . ఈ చర్యకు తామే బాధ్యులమని జైష్ ఉల్ హింద్ అనే నిషిద్ధ సంస్థ ప్రకటించుకుంది . ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమేనని ఇజ్రాయిల్ రాయబారిని ఉద్దేశించి రాసిన లేఖ ఆ ప్రాంతంలో లభించడం పలు అనుమానాలకు తావిస్తున్నది . అనుక్షణం భద్రతా దళాలు పహారా కాసే దేశ రాజధానిలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే విజయ్ చౌక్ ఉంది . పేలుడు సంభవించిన సమయంలో , విజయ్ చౌక్ వద్ద రిపబ్లిక్ డే ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి . రాష్ట్రపతి , ప్రధాని వంటి ప్ర ముఖులు అక్కడే ఉన్నారు . ఈ కారణంగానే పేలుడ ఘటన చోటు చేసు కున్న వెంటనే , భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి . దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించాయి .

Delhi bomb blast

ఇది చాలా సాధారణమైన బాంబు అని , దీని వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదని పోలీస్ అధికారులు తొలుత ప్రకటించారు . కానీ , శనివారం ఆ ప్రాంతాన్ని అణువణువు గాలించిన జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఎఎ ) బృందం కొన్ని కీలక ఆధారాలు సేకరించింది . సగం కాలిపోయిన గులాబీ రంగు చున్నీని , అక్క డికి సమీపంలోనే ఉన్న ఒక లేఖ ఉంచిన కవర్‌ను స్వాధీనం చేసుకుంది . ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ముందున్న అబ్దుల్ కలామ్ రోడ్డుపైన ఉన్న ఓ పూల కుండీలో బాంబును పెట్టడంతో , ఆ ప్రాంతం స్వల్పంగా దెబ్బ తిన్నది . సమీపంలోని రెండుమూడు వాహనాలు పాక్షికంగా ధ్వంసం కావడాన్ని మినహాయిస్తే , ఎలాంటి నష్టం జరగలేదు . పోలీస్ అధికారులతోపాటు , దర్యాప్తు బృందం సభ్యులు కూడా శనివారం సంఘటన స్థలాన్ని పరిశీ లించి , ఈ బాంబు సుమారు 20 నుంచి 25 మీటర్ల దూరానికి మాత్రమే పరిమితమయ్యే బాంబుగా పేర్కొన్నారు . ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ( ఎఎ ) కి చెందిన పది మంది సభ్యులతో కూడిన బృందం ఆ ప్రాంతం నుంచి పలు నమూనాలు సేకరించింది . బాల్ బేరింగ్స్ తో ఈ బాంబును తయారు చేసినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చింది . సిసి ఫుటేజ్ ని పరిశీలించి , ఇద్దరు అనుమానితులు గుర్తించింది .

2012 లో ఇదే తరహారాలో ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంఘటన చోటు చేసుకుంది . ఈ రెండు సంఘటనలకు ఏవైనా సంబంధం ఉందా ? అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నది . మరోవైపు ఇజ్రాయిల్ నుంచి దర్యాప్తు బృందం ఢిల్లీ చేరుకుంది . సమగ్ర విచారణ జరిపించాలని ఇజ్రాయిల్ భావిస్తోంది . గత ఏడాది ఇరాన్ మిలటరీ అధికారి ఖాసిం సులేమానీ , న్యూక్లియర్ సైంటిస్టు మొసెన్ ఫక్రిజాదే హత్యకు గురయ్యారు . అందుకు ప్రతీకారం గానే శుక్రవారం ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం ముందు బాంబు పేల్చామని , ప్రస్తుతానికి దీనిని ట్రైలర్ లాగా భావించాలని అక్కడ లభించిన లేఖలో పేర్కొని ఉండడంతో , అధికారులు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవెల్యూష నరీ గార్డ్ కార్డ్స్ ( ఐఆర్జిసి ) హస్తం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . మొత్తం మీద ‘ ఇది ట్రైయల్ మాత్రమే ‘ అని అక్కడ లభించిన లేఖలో స్పష్టంగా ఉండడంతో , అధికారులు అప్రమత్తమయ్యారు . అన్ని విధాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు .

Related Articles

Back to top button