గ్రామ సర్పంచ్ తప్పకుండా పాటించాల్సిన నియమాలు, TS panchayatiraj law
TS panchayatiraj law 1993 ఏప్రిల్ 24 న అమలులోకి వచ్చిన 73 వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 1994 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ చట్టం చేశారు . ప్రత్యేక తెలం గాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పుల కోసం కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి విజయానం ద్ , విశ్రాంత ఐఏఎస్ చల్లప్ప తదితర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు . అప్పటి పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఇతర మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర్ రావు , హరీశ్ రావు , ఈటల రాజేందర్ , కేటీఆర్‌తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు . సుదీర్ఘ కసరత్తు అనంతరం రూ పొందించిన ‘ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ‘ బిల్లును తెలంగాణ రాష్ట్ర శాసన సభ 2018 మార్చి 29 న ఆమోదించింది .
ఏప్రిల్ 18 నుంచి చట్టం అమలులోకి వచ్చింది . కొత్త చట్టంలో 9 భాగాలు , 10 చాప్టర్లు , 297 సెక్షన్లు ఉన్నాయి . తర్వాత కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి . ప్రస్తుతం రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి . వీటిలో 100 శాతం ఎస్టీ జనాభా గల జీపీలు 1326 ఉన్నాయి . కొత్త చట్టం ప్రకారం 3 అంచెల వ్యవస్థను ప్రతిపాదించారు . గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ , మండల స్థాయిలో మండల పరిషత్ , జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ . అయితే ఈ చట్టం మున్సిపల్ కార్పొరేష న్లు , మున్సిపాలిటీలు , తెలంగాణ మున్సిపాలిటీ చట్టం -1965 లో పేర్కొన్న నోటిఫైడ్ ప్రాంతాలు , మైనింగ్ సెటిల్ మెంట్స్ చట్టం -1956 లో పే ర్కొన్న మైనింగ్ ఏరియాస్ , కంటోన్మెంట్ చట్టం -2006 లో పేర్కొన్న కంటోన్మెంట్ ప్రాంతాల్లో వర్తించదు .
TS panchayatiraj law
ముఖ్యాంశాలు :
• గ్రామ సభ సమావేశాలకు ఆహ్వానితులగా మండల ప్రజాపరిషత్ , జిల్లా ప్రజాపరిషత్ , రాష్ట్ర విధాన సభ సభ్యులు హాజరవుతారు ( శా శ్వత ఆహ్వానితుడు – ఎంపీటీసీ )
• సెక్షన్ -10 గ్రామ సభ సమావేశాలు కోరం గురించి వివరిస్తుంది . ( 500 లోపు ఓటర్లు గల గ్రామసభలో ఉండాల్సిన కోరం 50 )
• గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య కనిష్ఠంగా 5 , గరిష్ఠంగా 21 .
• వివిధ రంగాలకు చెందిన ముగ్గురు కోఆప్షన్ సభ్యులను పాలకవర్గం నియమించుకునే అవకాశం ఉంది . ( 1. రిటైర్డ్ ఉద్యోగి లేదా సీనియర్ సిటిజన్ , 2. గ్రామమహిళా సంఘం అధ్యక్షురాలు , 3. విరాళాలు ఇచ్చే దాత ) .
• జనాభా ప్రాతిపదికన ఒక రిజర్వేషనన్ను వరుసగా రెండు ఎన్నికలకు వర్తింపజేస్తారు .
•గ్రామపంచాయతీలో ఒక వేళ ఖాళీలు ఏర్పడి తే సెక్రటరీ 15 రోజుల్లోగా ఎన్నికల కమిషనర్ కు సమాచారం ఇవ్వాలి . కమిషన్ 4 నెలల లోపు ఎన్నికలు నిర్వహిస్తుంది .
• సెక్షన్ -49 ప్రకారం గ్రామంలో 4 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి .
• గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ , ఉపసర్పంచ్ లకు ఉమ్మడి చెక్ పవర్ ఉంది .
•జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామ పంచాయతీ కి ఏటా 5 లక్షల రూపాయలకు రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపు ఉంటుంది .
•ఎంపీటీసీల రిజర్వేషన్లు కలెక్టర్లు నిర్ణయిస్తే , ఎంపీపీల రిజర్వేషన్ కమిషనర్ నిర్ణయిస్తారు .
•పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ తన రాజీనామాను జీపీకి లేదా డీపీవోకు సమర్పించవచ్చు . సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి అవకాశం లేదు .
•ఉపసర్పంచ్ తన రాజీనామాను ఎంపీడీ వోకు గా బిల్లా పంచాయతీ అధికారికి గానీ సమర్పించవచ్చు . ఇతనిపై మొదటి రెండేళ్ల లోపు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టకూడదు .
•మండల ప్రజాపరిషత్ లో , సెక్షన్ -145 కింద ఎన్నుకున్న సభ్యులు , సంబంధిత నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే , ఎంపీలు , ఆ మండలంలో ఓటు కలిగి ఉన్న ఎమ్మెల్యేలు , కో ఆప్షన్ సభ్యు లుగా ఉంటారు .
•సెక్షన్ -37 ప్రకారం ముగ్గురు సభ్యులతో కూడిన గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి . సర్పంచ్ , ఉపసర్పంచ్ , వార్డు సభ్యులు , కార్యదర్శిపై కలెక్టర్ తీసుకు న్న నిర్ణయాలను ఈ ట్రిబ్యునల్ లో అప్పీలు చే సుకోవచ్చు . ఇవి సంబంధిత కేసును 6 నెలల్లో పరిష్కరించాలి .
• జడ్పీలో ఎన్నికైన సభ్యులు , ఆ జిల్లాలోని ఎమ్మె ల్యే , ఎంపీలు , జిల్లా పరిధిలో మండల పరిష త్తులో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీలు , జిల్లాలో ఓటరుగా ఉన్న ఎమ్మెల్సీలు , ఇద్దరు కో – ఆప్షన్ సభ్యులు జడ్పీలో సభ్యులుగా ఉంటారు .