ఇరకాటంలో పడ్డ సీఎం కేసిఆర్, KCR in next plan ?
కేంద్రం చేసిన రైతాంగ చట్టాలు– రాష్ట్ర ప్రభు త్వం KCR in next plan ? తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై అధికార టిఆర్ఎ స్లో అంతర్మథనం సాగుతోంది . కేంద్ర రై తాంగ వ్యతిరేక చట్టాలపై సమరశంఖం పూరించిన పార్టీ వెనుకడుగు వేయడం పార్టీ అన్ని స్థాయిల్లో తీవ్ర చర్చ సాగుతుంది . దానికి తోడు వానాకాలం పంటకాలంలో రాష్ట్ర ప్రభు త్వం సమర్థవంతంగా చేపట్టిన ధాన్యం కొను గోలు మాదిరిగా యాసంగి పంట కొనుగో లుకు ఇక ముందుకు రాదన్న సంకేతాలివ్వడం రైతులను రోడ్ల మీదికి పురికొల్పినట్లు అవు తుందని , దళారీల చేతుల్లో రైతాంగం విలవిల లాడక తప్పని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
ఇప్పటికే పలు వర్గాల ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను కొని తెచ్చుకు న్నామని , ఇక రైతాంగం కూడా రోడ్డెక్కితే పరి స్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు . భారత ఆహార సంస్థ ( ఎఫెసిఐ ) వానాకాలంలో సేకరించిన మొత్తానికన్నా కొద్దిగా తక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలుకు సిద్ధమై స్పష్టత ఇచ్చినప్ప టికీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన సుతిలి , గోనెసంచులు , పట్టాలు , ఐకెపి కేం ద్రాల ఏర్పాటుకు పౌరసరఫరాల శాఖకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో మరింత ఆందోళన మొదలైంది . కిందిస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బాహా టంగానే అసంతృప్తులు వెల్లడవుతున్నాయి .
KCR in next plan ?
రాజ్యసభలో బుధవారం నాడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె . కేశవరావు చేసిన ప్రకటన ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనుకకు మాదిరిగా ఉందని ఒక శాసనసభ్యుడు వ్యాఖ్యానించారు . మరోవైపు విద్యాధిక నిరుద్యోగుల్లో ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు టిఆర్ఎస్ వ్యతిరేక నిలయాలుగా మారాయి . ఖాళీల భర్తీపై ప్రభుత్వం చెప్పిన మాటలు వాస్తవాన్ని ప్రతిబింబిం చడం లేదని పిఆర్ సి నివేదికతో బహిర్గతమైందని పాలక పార్టీకి చెందిన మరొక నాయకుడు అన్నారు . ఉన్న ఖాళీలు భర్తీ చేయకుండా , పదవీ విరమణ చేసే ఉద్యోగుల పదవీ కాలం మరో రెండు సంవత్సరాలు పెంచడం అగ్గిమీద గుగ్గిలంలా ఉందన్నారు . ఈ పరిణాలు ఎటు దారితీస్తాయో చెప్పలేమని మూడు పర్యాయాలు ఎన్నికైన శాసనసభ్యుడొకరు అన్నారు . మంత్రుల్లో , శాసనసభ్యుల్లో , కిందిస్థాయిలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఏం చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే !