కన్నీళ్లు పెట్టుకున్నా బాధితులు, flood victims wept tears
కూలిపోయిన మా ఇళ్లను ఎప్పుడు కట్టిస్తారూ సార్ అంటు flood victims wept tears వరద బాధితులు కన్నీటి పర్వంతమయ్యారు . రోజుల తరబడి కార్యాల యాల చుట్టూ తిరిగిన ఎవ్వరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . బషీర్ బాగ్ ఓల్డ్ కమెలాకు చెందిన వరద బాధితులు జిహెచ్ఎంసి ప్రధాన కార్యా లయం దగ్గర శనివారం నిరసన వ్యక్తం చేశారు . నాలుగు నెలల కిందట మహానగరాన్ని భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కు కుపోయాయి . నెలల తరబడి కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్న పరిస్థితులు తెల్సిందే . అనేక ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు నిర్వాసి తులుగా మారారు . వరదలు వచ్చినప్పుడు ఎప్పటి మాది రిగానే ప్రభుత్వం భారీ ఎత్తున హడావుడి చేసింది . ఇళ్లు కూలిపోయిన వారికి రూ.లక్ష పాక్షికంగా కూలిన వారికి రూ .50 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది . తక్షణ సాయం కింద రూ .10 వేలు పంపిణి చేశారు . జిహెచ్ఎంసి ఎన్నికల ముందు రూ .10 వేలు హడావు డిగా పంపిణి చేసిన ప్రభుత్వ అధికారులు అనంతరం దాని ఊసేఎత్తడం లేదు . రూ .10 వేలు మాత్రమే ఇచ్చి చెతులు దులిపేసుకున్నారని ఇళ్లు కూలిపోయిన నిర్వసి తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
flood victims wept tears
ఇళ్లు కూలిపోయ్యి నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందకపోవడంతో వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . తమ ఇళ్లు కూలిపోయి నాలుగు నెలలుగా అద్దె ఇళ్లలోనే ఉంటున్నామని , కరోనా కారణంగా పనులు లభించకపో వడంతో ఉపాధి కరువైందని , కనీసం ఉండేందుకు ఇళ్లు ఉన్నా తమకు నీడ ఉంటుందని అంటున్నారు . తమ ఇళ్లు కూలిపోవడంతో భారీ వర్షాల కారణంగా ఇళ్ల కోల్పోయి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ తమకు ఆర్థిక సాయం అందించాలని బషీర్ బాగ్ ఓల్డ్ కమెలాకు చెందిన బాధితులు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం దగ్గర అధికారులను కోరారు . ఇళ్లు లేక రోడ్డున పడ్డా మని వాపోయారు . నాలుగు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .
వరదల సమయంలో , ఎన్నికల ప్రచా రంలో తిరిగిన మంత్రులు ఇళ్లు కూలిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చా రని , ఇప్పుడేందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు . సర్కార్ ఇస్తామన్న రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తే తాము ఇంటిని నిర్మించుకుంటామని 10 కుటుంబాలకు చెందిన బాధితులు కోరారు . తమ ఇళ్లు కూలిన నుంచి ఏ ఒక్క అధికారి కూడా తమ వద్దకు రాలేదని , వరదల సమయంలో ఎంఎ వచ్చి త్వరలో మీకు ఆర్థికం సాయం అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఇవ్వ కపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఎక్కడికి పోయిన కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు . వరదల్లో నష్టపోయిన వారికి వందలాది కోట్లు ఖర్చు చేశామని ప్రభుతవం చెబుతున్నప్పటికీ , మాకేందుకు సాయం ఇవ్వలేదని ప్రశ్నించారు . ప్రభుత్వం సాయం ఇవ్వక పోతే నిరహార దీక్షకు దిగుతామని వరద బాధితులు హెచ్చరించారు .