Trending

కేసిఆర్ స్ట్రాంగ్ వార్నింగ్, KCR warns ministers

సిఎం మార్పు ఉండబో దని టిఆర్ఎస్ అధ్యక్షులు , ముఖ్యమంత్రి కెసిఆర్ KCR warns ministers స్పష్టతనివ్వడంతో మంత్రులు , ఆ పార్టీకి చెందిన ఎంఎల్‌ఎలు , ఎంఎల్‌సిలు , ముఖ్యనేతలంతా అవా క్కయ్యారు . త్వరలోనే కెటిఆర్‌కు పట్టాభిషేకం కాబోతుందని , ఆయన మంత్రివర్గంలో ఫలాన నేతలకు అవకాశం లభించబోతున్నట్టు విస్తృ తంగా ప్రచారం జరిగింది . ఇలాంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ నేతలు పోటీపడి మరీ ‘ రామన్నే ‘ కాబోయే సిఎం అంటూ బహిరంగంగానే ప్రకట నలు గుప్పించారు . ఒకరిని చూసి మరొకరు ఇలా పోటీపడ్డారు . కెటిఆర్‌ను సమర్ధించపోతే ఎక్కడ తమ పట్ల వ్యతిరేక భావం ఏర్పడుతుందని ఉద్దే శంతో ఇంకొందరు అదే బాట పట్టారు . ఇలా గత కొంతకాలంగా కెటిఆర్ సిఎం అంటూ , ఏకంగా తేదీలను కూడా ప్రకటించారు . ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందజర్ కూడా ఈ వ్యాఖ్యాలను సమర్ధించడంతో వాస్తవంగానే కెటిఆర్‌ను సిఎం చేస్తారనే చర్చ ఊపందుకుంది . గత ఏడాది ఇదే మాసంలో ఇలాంటి చర్చ జరిగిన ప్పటికీ తాజా రాజకీయ నేపథ్యంలో కెటిఆర్ సిఎం అవుతారని ఆ పార్టీ నేతలు బలంగా భావించారు .

పైగా టిఆర్ఎస్ కార్యవర్గ సమావేశం , పార్టీ అధ్య క్షుని ఎన్నిక అని ప్రకటన వెలువడగానే ఇక కెటిఆ రకు లైన్ క్లియర్ అయిందని , ఆయనకు పట్టాభి షేకం ఖాయమంటూ మరింత బలంగా ప్రచారం జరిగింది . కానీ అలాంటి ఛాన్సే లేదని సిఎం కెసి ఆర్ సిఎం మార్పు ప్రచారాన్ని పటాపంచలు చేశారు . దీంతో ఇప్పటి వరకు కెటిఆర్ సిఎం అంటూ ప్రచారం , ప్రకటన చేసిన వారంతా అవా క్కయ్యారు . ఇంతకు ఈ చర్చ ఎక్కడి నుంచి మొద లైందోకానీ మొత్తానికి సిఎంతో క్లాస్ తప్పలేదని మరికొందరు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు . ముందస్తుగానే శుభాకాంక్షలు చెప్పిన నేతలు కూడా ఒక్కసారిగా అసంతృప్తికి గురయ్యారు . సమావేశంలో ఏం జరిగిందో ఏమో కానీ మీడి యాతో మాట్లాడే సమాయంలో సిఎం మార్పు విష యమై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు . సిఎం మార్పుపై సిఎం తీవ్రంగా స్పందించారని కొందరు , “ అదేం లేదే అంతా కామనే కదా ‘ అంటూ మరి కొందరు , ఏం మాట్లాడలో తెలియ దంటూ ఇంకొందరు వ్యాఖ్యానించడం గమ నార్హం . మొత్తానికి సిఎం మార్పు అంశం టి కప్పులో తుఫానుగా మారింది .

KCR warns ministers

ఇక మరోసారి డౌటే .. ? కెటిఆర్ సిఎం అవుతారని విస్తృత ప్రచారం జరిగి నప్పటికీ చివరకు అంతా ఉత్తదేనని తేలింది . ఇప్ప టికే రెండు పర్యాయాలు ఇలాగే విస్తృత ప్రచారం జరిగింది . అయితే అలాంటిదేమీ లేదని సాక్షాత్తూ సిఎం కెసిఆర్ స్పష్టం చేయడంతో ఇక మరోసారి ఇలాంటి ప్రచారం చేసేందుకు మంత్రులు , ఎంఎలు సాహసం చేసే అవకాశాలే దాదాపు లేనట్లే నని పార్టీ వర్గాలే చెబుతున్నాయి . కెటిఆర్ సిఎం అనే ప్రచారం ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ , ఎవరు లీకులు చేసినప్పటికీ భవిష్యత్ లో మరోసారి ఇలాంటి ప్రచారంలో భాగం కావద్దనే భావన ఎంఎల్‌లో నెలకొంది . ఇటీవల బహిరంగంగా పెద్ద ఎత్తున కెటిఆర్ కాబోయే సిఎం అని విస్తృత ప్రచారం చేసిన వారంతా తమ వ్యాఖ్యాలను సరిది ద్దుకునేందుకు సన్నద్ధమవుతున్నారు . ఈ నెల 17 న సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలన ఘనంగా నిర్వ హించే కార్యక్రమంలో నిమగ్నం కానున్నారు .

మంత్రులు , జెడ్ పి ఛైర్ పర్సన్లతో సిఎం ప్రత్యేక సమావేశం టిఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ముగియగానే సిఎం కెసిఆర్ జిల్లాకు చెందిన మంత్రులు , జిల్లా పరిషత్ చైర్మన్లు , పోడుభూము ప్రాంతానికి చెందిన ఎంఎలతో తెలంగాణ భవన్లో ఆది వారం ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం . నాగార్జునసాగర్ ఉప ఎన్నిక , వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్ , రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్ని కల నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన కొందరు మంత్రులతో కెసిఆర్ ప్రత్యేకంగా మాట్లా డినట్టు తెలిసింది . తాజా పరిస్థితులు , పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు , ప్రత్యర్థులను ఎలా అడ్డుకోవాలి , పార్టీ బలోపేతానికి తీసుకునే చర్యలపకై వారికి కెసిఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది . ఇదిలా తెలంగాణ భవన్ గేటుపక్కనే ఏర్పాటు చేసిన క్యాంటినను ఆదివారం ప్రారంభిం చారు .

Related Articles

Back to top button