Trending

ఢిల్లీలో బాంబ్ పేలుడు, Bomb blast in Delhi

న్యూఢిల్లీ : Bomb blast in Delhi అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య , అనుక్షణం పోలీస్లు , జవాన్లు పహారా కాసే దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ కా ర్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలింది . ఈ సంఘటనలో ఎవరూ గాయపడలదని అధికారులు ప్రకటించారు . అయితే , గణతంత్ర దినోత్సవ ముగింపు వేడు కలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో , భద్రతా బలగాలు అప్రమ త్తమయ్యాయి . అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూ రంలో జరిగిన రిపబ్లిక్ డే ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంక య్య నాయుడు , ప్రధాని నరేంద్ర మోడీ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు . అలాంటి కీలక సమ యంలో బాంబు పేలడం అధికారులను ఆందోళ నకు గురి చేసింది .

అయితే , ఇది చాలా సాధార ణమై బాంబు అని , దీని వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదని పోలీస్ అధికారులు పే ర్కొ న్నారు . ఇలావుంటే , విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ సంఘటనపై ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రితో చర్చించారు Bomb blast in Delhi . ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసు కుంటామని హామీ ఇచ్చారు . మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు పరిస్థి తిని సమీక్షిస్తున్నారు . సంఘటనా స్థలాన్ని సంద ర్శించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవా త్సవ ఆతర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ముందున్న అబ్దుల్ కలామ్ రోడ్డుపైన ఉన్న ఓ పూల కుండీలో బాంబును పెట్టినట్టు చెప్పారు . సమీపంలోని రెండుమూడు వాహనాలు పాక్షికంగా ధ్వంసం కావడాన్ని మినహాయిస్తే , ఎలాం టి నష్టం జరగ లేదని తెలిపారు . ఆ ప్రాంతంలో మరెక్కడైనా బాంబులు పెట్టి ఉంటారా అన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగించామని చెప్పారు . అన్ని విభాగాలను అప్రమత్తం చేశామని , పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పేర్కొన్నారు .

Related Articles

Back to top button