ఆగ్రహించిన నిరుద్యోగులు, ఉద్రిక్తత, Unemployees demand TS government

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను తక్ష ణమే భర్తీ చేయాలని Unemployees demand TS government ఎఐవైఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది . సోమవారం హైదరాబాద్ నాం పల్లిలోని టిఎస్ పి ఎస్ సి కార్యాలయాన్ని ముట్టడిం చింది . కార్యాలయం ముందు నాయకులు , కార్య కర్తలు బైఠాయించారు . అనంతరం కార్యాలయం లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నాయ కులు , కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి , స్టేషన్ తరలించారు . ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు . రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు . తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఉద్యోగాల కోసం యువత బలిదానం చేశారన్నారు . యువత ప్రాణాలతో స్వరాష్ట్రం సాధించుకున్నార ని చెప్పారు .

త్యాగాల పునాదులపై అధికారం చేపట్టిన కెసిఆర్ ప్రభు త్వం .. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం , ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శిం చారు . 2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో లక్ష 7 వేలకు పైగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని , ప్రభుత్వ గణాంకాలు చెప్పిన ఉద్యో గాలను భర్తీ చేయడంలో ఉదాసీన వైఖరితో నిరు ద్యోగుల బతుకులు అగమ్యగోచరంగా మారాయ న్నారు . టిఎస్ పి ఎస్ సిలో వటైం రిజిస్ట్రేషన్లో దాదాపు 22 లక్షలకు పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకు న్నారు , అరకొరగా విడుదల చేసిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లలో కూడా పారదర్శకత లోపించిందని విమర్శించారు . లోపభూయిష్టమైన నోటిఫికేషన్ లతో కోర్టు విచారణలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు . ఒకవైపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రులు చెబుతుంటే .. టిఎస్ పిఎస్ మాత్రం కేవలం 32 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్లు ప్రకటించడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుదన్నారు .

Unemployees demand TS government

జిల్లా కేంద్రాల్లో ఉన్న ఎంప్లాయిమెంట్ కార్యాలయాలు పేర్లు నమోదు చేసుకోని దిష్టిబొమ్మల మాదిరిగా మారిపో యాయని ఆవేదన వ్యక్తం చేశారు . ఎన్నికల్లో ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యో గులకు రూ .3116 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీనిచ్చారని అన్నారు . అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని విమర్శించారు . పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా కెసిఆర్ హడావుడిగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం నమ్మశక్యంగా లేదన్నారు . నిరుద్యో గులపై నిజంగా ప్రేమ ఉంటే ప్రభుత్వం మూడు లక్షల ఉద్యోగాల నియామ కానికి సంబంధించి ఉద్యోగాలకు ఎంఎల్‌సి నోటిఫికేషన్ కన్నా ముందే ఉద్యో గాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు . హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి లేక తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు .

ప్రభుత్వం స్వయం ఉపాధి పథకం ద్వారా ఉద్యోగ కల్పన అనేది ఒట్టి మాటలే అవుతున్నాయని విమర్శించారు . నగ రంలో జాతీయ , అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వచ్చిన స్థానిక యువతకు ఉపాధి అవకశాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమ ర్శించారు . మేడ్చల్ జిల్లా అధ్యక్షులు టి.సత్య ప్రసాద్ మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబంలో మాత్రం ఉద్యోగాలను భర్తీ చేసుకున్నారని అన్నారు . రాష్ట్రం కోసం పోరాటం చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎందుకు కల్పిం చడం లేదని ప్రశ్నించారు . ఇంటికొక ఉద్యోగం అని అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు . ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ నాయకులు కె.ధర్మంద్ర , ఎస్.కె.మహమూద్ , ఎం.అసాద్ అలీ , హైమాద్ అన్సారీ , శ్యామ్ , మాజిద్ అలీఖాన్ , చైతన్య యాదవ్ , షెక్ భాషా పాల్గొన్నారు .

Related Articles

Back to top button