విద్యార్థులకు శుభవార్త..? TS govt likely to promote students

కరోనా మొత్తం వ్యవస్థను అతలాకుతలం చేసింది . ఆరు నెలల కాలంలో ఆలోచనలన్నీ తలకిందులయ్యాయి . TS govt likely to promote students మార్చి 22 తర్వాత ఇంత వరకు పాఠశాలలు తెరుచుకోలేదు . ఆన్లైన్ విద్యాబోధన చేస్తున్నప్ప టికీ ప్రైవేటు విద్యా సంస్థలు అది కూడా కార్పొ రేట్ సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఆన్ లైన్ తరగతులకు విధిగా హాజరవుతున్నారు కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న వారు చిన్నా , చితక ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యనభ్య సిస్తున్న వారు కానీ ఆన్లైన్ తరగతులకు హాజరు కావడం లేదు . ఆన్లైన్ విద్యాబోధన తీరు ఎలా ఉన్నా ఆన్లైన్ ద్వారా పాఠాలు వినేందుకు పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి . ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడం ఉంటే సిగ్నల్స్ సరిగ్గా లేకపో వడం ఇబ్బందికరంగా మారింది .

ఇక టివిల ముందు కూర్చోబెడితే పట్టణాలు , నగరాల్లో నివ సిస్తున్న విద్యార్థుల కుటుంబాల విషయంలో కాస్త ఫర్వాలేదనిపిస్తుంది . చిన్న పిల్లలైతే ఎవరో ఒకరు దగ్గరుండి పాఠాలు వినే విధంగా శ్రద్ధ వహి స్తున్నారు . ఇక ఉన్నత విద్యాభ్యాసం చేసే వారికి నగరాలు , పట్టణాల్లో నివసించే వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు . ప్రత్యేక గదులు వాటిల్లో టివిలు ఏర్పాటు చేయడంతో వారి ఆన్లైన్ విద్యా భ్యాసం కొంచెం ఫర్వాలేదనిపిస్తుంది . కానీ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితి ఘోరం గా ఉంది . తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తుండడంతో విద్యార్థులు విద్యపై దృష్టిసారించ లేకపోతున్నారు . వనరుల లేమి ఒక ఎత్తయితే ఆన్లైన్ తరగతులకు ప్రత్యేకంగా హాజరు కావా లన్న విషయాన్ని చెప్పే వారు లేకపోవడం మరో క అంశమైంది .

TS govt likely to promote students

పాఠశాలకు హాజరై ఆన్లైన్ తర గతులు వినేటప్పుడే సరిగ్గా పట్టించుకోని ప్రాథ మిక , ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలల విద్యా ర్థులు ఆప్పుడు ఆన్లైన్ పాఠాలు వినే పరిస్థితి లేదు . ఇక కార్పొరేట్ సంస్థలు ఆన్‌లైన్ విద్యాబో ధనకు కూడా ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి . హాస్టల్ ఫీజు మినహా మిగిలిన మొత్తం ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా యి . కార్పొరేట్ సంస్థల్లో పిల్లలను చదివించే తల్లి దండ్రుల్లో దాదాపు 80 శాతానికి పైగా ఇప్పటికే ఫీజులు చెల్లించారు . ఇక మాధ్యమిక స్థాయిలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితి ఘోరంగా తయారైంది . ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన విద్యా సంస్థ లు ఆర్థికంగా కుదేలయ్యాయి . ఏ విద్యార్థి ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోగా ఆన్ లైన్ తరగతులు కూడా వినే పరిస్థితి లేదు . నా పాఠశాలలో పదో తరగతిలో 42 మంది విద్యార్థులు ఉన్నారు . ఖర్చుకు వెనకాడకుండా ఉపాధ్యాయులకు వేత నాలు ఇచ్చి ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేస్తు న్నారు .

పదోతరగతికి చెందిన ఏ విద్యార్థి ఫీజు చెల్లించకపోగా 12 మందికి మించి ఆన్లైన్ తర గతులకు హాజరు కావడం లేదని వాపోయారు . మిగిలిన ప్రైవేటు పాఠశాలల పరిస్థితి బహుశా ఇందుకు భిన్నంగా లేదు . విద్యార్థుల తల్లిదం డ్రులు గతేడాది మాదిరిగానే ప్రభుత్వం ఈ ఏడాది కూడా పరీక్షలు నిర్వహించకుండానే తమ పిల్లలను ప్రమోట్ చేస్తుందన్న ఆశ తల్లిదం డ్రుల్లో నెలకొంది . ఒకవేళ ప్రమోట్ చేస్తే రెండేళ్ల పాటు ఎటు వంటి పరీక్షలు నిర్వహించకుండానే ఉన్నత స్థానాలకు పంపితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతాయి . అలా అని చెప్పి పరీక్షలు నిర్వహిస్తే ఉత్తీర్ణులయ్యే వారి సంఖ్య గణనీ యంగా తగ్గిపోతుంది . ఈ ఏడాది మొత్తం విద్యారంగం సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటుంది . ప్రభుత్వం చెబుతున్నట్లుగా జనవరి 15 తర్వాత విద్యా సంస్థలు ప్రారంభమైతే ఎక్కడి నుంచి విద్యా బోధన చేయాలన్నది సమస్యగా మారు తుంది . ఆన్ లైన్ బోధన ద్వారా విద్యనభ్యసించిన విద్యార్థులు ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది . మొత్తంగా విద్యా బోధనే కాదు రేపటి నిర్ణ యాలు గందరగోళంగా మారే అవకాశం ఉంది .

Related Articles

Back to top button