కాళేశ్వరం లో దారుణ సంఘటన, Mother daughter committed suicide
పురుగుల మందు సేవించి తల్లి కూతుళ్లు ఆత్మహత్య Mother daughter committed suicide : ఆస్తి పాస్తుల విషయంలో అత్తింటి వారి కుటుంబ కలహాలతో విసిగి మన స్తాపం చెందిన తల్లి కూతు ర్లు పురుగుల మందు సేవిం చి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలోని మెట్ పల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది . స్థానికుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే … ఎమునూరి సమత అనే మహిళ భర్త వెంకట్ రెడ్డి గత పది సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి వెన్నుపూస విరిగి మంచానికే పరిమితం కావడంతో భర్తతో పాటు తన ఇద్దరు కుమార్తెలైన అంజలి , అశ్వినిలకు ఏ లోటూ రాకుండా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేది.
గత తొమ్మిది నెలల క్రితం భర్త మృతి చెందడంతో ఆస్తి పాస్తుల విషయంలో అత్తింటి వారి కుటుంబ కలహాలు పెరిగిపోయి మనస్థాపానికి గురి చెందిన సమత ( 35 ) తన చిన్న కూతురు అశ్విని ( 13 ) తో కలిసి పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళడం గమనించిన పెద్ద కూతురు అంజలి గ్రామస్థులకు సమాచారం అందించడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో తల్లి కూతుర్లు మృతి చెందారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొని కన్నీరు మున్నీరవు తున్నారు . మృతురాలి పెద్ద కూతురు అంజలికి తన అత్తింటి ఆస్తిపాస్తుల్లో సర్వ హక్కులు కల్పించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు .