Trending

భయపెడుతున్న పులి, Tiger roaming in Kottagudem

పెద్దపులి సంచారం భద్రాద్రి కొత్తగూడెం ప్రజానికాన్ని బెంబేలెత్తిస్తోంది . Tiger roaming in Kottagudem గడిచిన వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని చుట్టుముడుతున్న టైగర్ పశువులపై దాడి చేసి చంపి తింటోంది . మహారాష్ట్ర ప్రాంతం వైపున గల ఇంద్రావతి , ప్రాణహతీ నదులు వైపుగా జిల్లా అటవీ ప్రాంతంలోనికి పులుల మంద చొరబడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి . అక్కడి నుండి ఆసీఫాబాద్ జిల్లా , ములుగు ప్రాంతాల్లో సంచరిస్తూ అక్కడ మనుషులను సైతం చంపి తిన్నట్లు అధికారులు దృవీకరించారు . ములుగు అడవుల్లో నుండి మేడారం , పస్రా అడువుల మీదుగా గుండాల , ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలోనికి పులి వచ్చి ఉండవచ్చందని అటవీ అధికారుల చెబుతున్నారు .

21 న ఆళ్లపల్లి మండలంలో : జిల్లాలో తొలిసారిగా ఈనెల 21 వ తేదిన ఆళ్లపల్లి మండల పరిధిలోని అడవుల్లో పులి జాడలు బయటపడ్డాయి . మండల పరిధిలోని రాయిగూడెంలో జాడలు కనిపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు . మార్కోడు ప్రాంతానికి చెందిన సత్యనారాయణ అనే రైతు తన వ్యవసాయ పొలంలో ఎద్దుల కట్టేసి మరుసటి రోజు వెళ్లి చూడగా అందులో ఒక ఎద్దు మాయమైంది . ఆ తర్వాతి రోజు సమీప అటవీ ప్రాంతలో పెద్దపులి ఆ ఎద్దును ఎత్తుకెళ్లి తిన్నట్లు గుర్తించారు . దీంతో పెద్దపులి సంచారంపై మరింత భయాందోళన మొదలైంది . మొన్న సారపాక పుష్కర వనం : ఆళ్లపల్లి గుండాల అడవుల మీదుగా అశ్వాపురం , కృష్ణసాగర్ అడవుల్లో నుండి పెద్ద పులి సారపాక ఐటిసి సమీపంలో ఉన్న పుష్కర వనంలో ఈ నెల 27 రాత్రి సంచరించింది . అక్కడి నుండి సమీప కాలి గ్రామమైన రామాపురం వైపుగా పొలాల్లో తిరిగినట్లు అక్కడి ప్రజలకు అటవీ అధికారులకు చెప్పారు . ఆ ప్రాంతాల్లో అటవీ అధికారులు గాలించగా పెద్దపులి పంజా అడుగులు లభ్యం కావడంతో పులి సంచారంపై మరంత అప్రమత్తమయ్యారు .

Tiger roaming in Kottagudem

ఆ పులి అడుగులను సేకరంచిన అటవీ అధికారులు ఆ పులి సుమారు 7 సం . వయస్సు గలిగిన మగ పులి అయి ఉండే అవకాశం ఉందని అంటున్నారు . పులి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , దానికి ఎలాంటి హానీ తలపెట్టవద్దని అటవీశాఖ ఆధ్వర్యంలో బోర్డులను సైతం అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు . ఇందులో భాగంగా బిఎల్ సమీప ప్రాంతం నుండి క్రా రోడ్డు వరకు దారి పొడవునా పొదలను అటవీ అధికారులు కొట్టించారు అశ్వాపురం అడవుల్లోని గుట్ట పై తిష్ట : సారపాక పుష్కరవనం , పరిసర ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి ఇక్కడే ఉంటుందనే అనుమానాలు నిజమైనట్లు తెలుస్తోంది . తాజాగా అశ్వాపురం మండలం కనకరాజు గుట్టపై తిష్టవేసి ఉన్నట్లు అనుమానిస్తున్నారు . అనుమానిత ప్రాతంలో రెండు రోజుల క్రితం మృతి చెందిన ఎద్దు ఉంది . అయితే సమీప గ్రామాల్లో ఎద్దుపై దాడిచేసి దానిని గుట్టపైకి లాక్కొచ్చిన పెద్దపులి రెండు రోజులుగా అక్కడే ఉండి ఆ ఎద్దు రక్తాన్ని తాగి , దాని మాంసాన్ని తిన్నట్లు భావిస్తున్నారు . దీనిని ఇంకా అటవీ అధికారులు ధృవీకరించాల్సి ఉంది . కాగా పెద్దపులి సమీప అడవుల్లోనే ఉండటంతో మణుగూరు , అశ్వాపురం , సారపాక , లక్ష్మీపురం , బూర్గంపాడు , కృష్ణసాగర్ , మోతే , ఇరవెండితో పాటు సమీప అటవీ గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి . ఎట్నుంటి ఏ రాత్రి వేళ వచ్చి మీద పడుతుందో అని భయపడుతున్నారు . పశువులను ఎత్తికెళ్లి తింటే పర్వాలేదు గానీ మనుష్యులకు హాని చేస్తే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

రెండు పులుల సంచారం : జిల్లాలో ఆడా , మగ పులులు సంచరిస్తున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు . గురువారం ఆళ్లపల్లి మండల అటవీ ప్రాంతంలో గల అనంతతోగు సమీపంలో పులి అడుగు జాడలు కనిపించాయని అక్కడి ప్రజలు అంటున్నారు . తాజాగా అశ్వాపురం గుట్టల్లో పులి సంచారం ఉన్నట్లు అనుమానాలు రేకెత్తడంతో మొత్తం రెండు పెద్ద పులుల సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు . కానీ అటవీ అధికారులు మాత్రం జిల్లాలోని అడవుల్లో కేవలం ఒక్క పులి మాత్రం సంచరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని చెబుతున్నారు . అడవుల్లో సిసి కెమేరాలు : పెద్దపులి సంచారాన్ని కనిపెట్టేందుకు జిల్లాలోని పులి సంచార అటవీ ప్రాంతంలో మొత్తం 30 సిసి కెమేరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ అధికారి ఒకరు స్పష్టం చేశారు . పులి జాడ కోసం గ్రామాల ప్రజలతో పాటు అటవీ సిబ్బందితో కలిపి మొత్తం రెండు షిప్టులుగా రెండు బృంధాలు గల సుమారు 40 మంది సభ్యులు అటవీ ప్రాంతాల్లో నిఘా పెట్టారని చెబుతున్నారు . జిల్లా వ్యాప్తంగా సుమారు 200 కిమీ వరకు పెద్ద పులి సంచరించి ఉంటుందని , మహారాష్ట్ర నుండి ఇక్కడి వరకు సుమారు 500 నుండి 700 కిలో మీటర్ల వరకు పులి తిరిగి ఉంటుందని అటవీ అధికారులు అంటున్నారు .

బెబ్బులి భయం : జిల్లా వ్యాప్తంగా పెద్దపులి భయం పట్టుకుంది . మారుమూల ప్రాంతమైన ఆళ్లపల్లి అడవుల్లో నుండి మొదలుకుని భద్రాచలం సమీపంలోని ఐటిసి పిఎపిడి ప్రాంతంలో గల పుష్కరవనం వరకు పులి సంచారం ఉండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది . సుమారు పదేళ్ల తర్వాత పెద్దపులి అడవుల్లో సంచరించండంతో అటవీ గ్రామాల్లోని ప్రజలు భీతిల్లుతున్నారు .

Related Articles

Back to top button