భయబ్రాంతులకు గురిచేస్తున్న పులి, Tiger roaming in Telangana
రాష్ట్ర వ్యాప్తంగా పులుల సంచారం ఆందోళన కలిగిస్తుంది . Tiger roaming in Telangana అక్కడక్కడ పశువులపై దాడి చేస్తుండగా ఆదిలాబాద్ లో ఓ బాలికను వేటాడి చంపడం ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది . ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంతో పాటు బూర్గంపాడు , అశ్వాపురం అడవుల్లో పులుల సంచారం ఉన్నట్లు తెలుస్తుంది . సారపాక పారిశ్రామిక ప్రాంతంలో పులుల అడుగు జాడలు అటవీశాఖాధికారులు కనుగొన్నారు . పులుల సంచారం నిజమేనని నిర్ధారించారు . అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామ పంచాయతీలోని సాయిగుంపు గ్రామ శివారులో పెద్ద పులి అడుగు జాడలు ఉన్నట్లు తెలుస్తుంది .
మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లో పులులు ఉన్నాయన్న విషయం నిర్ధారణ అయింది . అశ్వాపురం ప్రాంతం నుంచి కిన్నెరసాని అభయారణ్యానికి పులులు తరలి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు . ఇదిలా ఉండగా పులుల సంచారాన్ని నిర్ధారించిన అటవీశాఖ అశ్వాపురం రేంజర్ పులుల సంచారం ఉంది కాబట్టి అడవుల్లోకి సమీప గ్రామస్తులు వెళ్లరాదని పెద్ద పులులకు ఎటువంటి హానీ చేయరాదని ఒక ప్రకటనలో తెలిపారు . ఉచ్చులు , కరెంటు తీగలు , వలలు మొదలైనవి అడవుల్లో అమర్చరాదని ఆయన స్పష్టం చేశారు . పులుల సంచారం లేదా అడుగు జాడలు కన్పిస్తే తమకు వెంటనే తెలియజేయాలని మేకలు , గొర్రెలు , పశువుల కాపరులు అడవిలోకి వెళ్లరాదని ఆయన తెలిపారు . వన్యమృగ సంరక్షణ చట్టం 1972 ప్రకారం పెద్ద పులులకు హాని కలిగిస్తే తీవ్రంగా శిక్షించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు .
Tiger roaming in Telangana
గత పది రోజులుగా పులి కలకలం అశ్వాపురం , బూర్గంపహాడ్ రైతులకు కంటిమీద కుకులేకుండా చేస్తుంది . ఏక్షణంలో ఎమి జరుగుతుందో అని ప్రాణాలు అరచేత పట్టుకుంటున్నారు . రాత్రివేళ ఒంటరిగా ప్రయాణాలు చేయాలంటే బయపడుతున్నారు . పశువుల కాప రులు పశువులను అడవులకు తీసుకపోకుండా ఊరిబయటనే మేపుతున్నారు . వరి చేతికి వచ్చి కొతల సమయం కావటంతో రైతులు పంటను కాపాడుకొవటానికి రాత్రివేళలో పోలాలకు పపోవటం మానివేశారు . గత నాల్గు రోజులుగా అటవీ శాఖ అధికారులు అశ్వాపుర మండల పరిధిలోని అనేక గ్రామాలలో గాలింపు చర్యలు చేపట్టారు .
రామచం ద్రాపురం , ఒడ్డుగూడెం గ్రామాల మద్య కడియాల బుగ్గవాగు సమీపంలో సందెళ్ల రామాపు రంలోని ఓరైతు పోలంలో , శనివారం సీతారామ ప్రాజెక్టు 2 లోని ఎకో వంతెన సమీపంలో పులి అడుగులు జాడలు అటవీ అధికారులు గుర్తించారు . ఆదివారం రాత్రి సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ దాటి తుమ్మల చెరువు పంచాయితీ పరిధిలోని తురకగూడెం గ్రామం మీదిగా మామిళ్లవాగుదాటి కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించి ఉంటుం దని అటవీ అధికారులు నిర్ధారించారు , కాని తుమ్మలచేరువు ప్రాంత ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని అటవీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు .