Trending

పెరిగిన పెట్రోల్ ధరలు, petrol prices hiked

వరుసగా ఐదో రోజూ .. petrol prices hiked పెట్రో ధరలు పరుగులు లీటర్ పెట్రోల్ పై 28 పైసులు , డీజిల్ పై 28 పైసలు పెంపు న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . అంతర్జాతీయంగా చమురుకు గిరాకీ పెరగడంతో భారత్ లో ఇంధనం ధరలను వరుసగా ఐదవ రోజు కూడా చమురు సంస్థలు పెంచాయి . ఆదివారం పెట్రోల్ పై 28 పైసులు , డీజిల్ పై 29 పైసల భారాన్ని మోపాయి . తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ . 83.13 నుంచి రూ . 83.41 కి పెరిగింది . డీజిల్ ధర లీటర్‌కు రూ . 73.32 నుంచి 73.61 కి చేరింది . ఈ మేరకు చమురు సంస్థలు ధరలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశాయి .

ముంబయిలో పెట్రోల్ ధర రూ . 90 , డీజిల్ ధర రూ . 80 మార్క్ ను దాటింది . పెట్రోల్ ధరలు పెరగడం వరుసగా ఇది ఐదవ రోజు కాగా , దాదాపు రెండు నెలల విరామం తరువాత చమురు సంస్థలు రోజువారీ ధరలను సవరించిన పునరుద్ధరించిన అనంతరం నవంబర్ 20 వ తేదీ నుంచి ధరలు పెరగడం ఇది 14 వ సారి కావడం గమనార్హం . petrol prices hiked దీంతో సెప్టెంబర్ 2018 తరువాత పెట్రోల్ , డీజిల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరాయి . ఈ 17 రోజుల్లో పెట్రోల్ ధర మొత్తంగా లీటరు రూ . 2.35 , డీజిల్‌కు రూ . 3.15 పెరిగింది . కొవిడ్ వ్యాక్సిన్ పై సానుకూల వార్తలతో అంతర్జాతీయంగా చమురు ధరలు పుంజుకున్నాయి . అంతర్జాతీయ మార్కెట్లో ముడి ఇంధనంపై 34 శాతం డిమాండ్ పెరగడంతో అక్టోబర్ 30 న 36.9 యుఎస్ డాలర్లుగా ఉన్న బ్యారెల్ ధర డిసెంబర్ 4 నాటికి 49.5 డాలర్లకు చేరింది .

భారత్ లో ధరలు పెరగడం ప్రారంభించిన నవంబర్ 22 వ తేదీకి ముందు సెప్టెంబర్ 22 నుంచి పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి . అదే విధంగా అక్టోబర్ 2 వ తేదీ నుంచి డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు . విదేశీ మారకపు రేటు , అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ , భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ , హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఇంధన ధరలను పెంచాయి . అయితే ఇటీవల కొవిడ్ మహమ్మారి కారణంగా రిటైల్ ధరలను కొద్ది రోజుల పాటు స్థిరంగా ఉంచారు . ఇదిలా ఉండగా , ముంబయిలో ఆదివారం పెట్రోల్ లీటరుకు రూ . 89.78 నుంచి రూ . 90.05 కు పెరగగా , డీజిల్ ధర రూ . 79.93 నుంచి 80.23 కు పెరిగింది . ధరలు ఆయా రాష్ట్రాల్లో స్థానిక సేల్స్ ట్యాక్స్ , వ్యాట్ ఆధారంగా మారుతూ ఉంటాయి .

Related Articles

Back to top button