దీన్ని బట్టి కేసిఆర్ మోసం చేస్తునట్టే కదా, No asara pensions in Telangana

పింఛన్ ఇస్తూ ఇంటికి పెద్ద కొడుకుగా నిలుస్తానన్న ముఖ్యమంత్రి కెసిఆర్ .. No asara pensions in Telangana ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది . మండల పరిషత్ కార్యాలయాల్లో నూతన దరఖాస్తుల కట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి . 60 ఏళ్లు కాదు 57 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నారు . కానీ ఇప్పుడు ఏ పింఛన్ మంజూరు కావడం లేదు . ఇక రేషన్ కార్డుల గురించి పట్టించుకునే నాథుడే లేడు . నాలుగేళ్లుగా పాత రేషన్ కార్డులతోనే గడిపేస్తున్నారు . కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసి కళ్లు కాయలు కాస్తున్నాయి తప్ప కార్డు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు . ఇకనైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .

పింఛన్ వస్తే వృద్ధాప్యంలో ఆర్థిక వెసులుబాటు ఉంటుందని భావించారు . జీవిత కాలం నిరంతరం శ్రమించి శరీరం సహకరించక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో పింఛన్ డబ్బులు ఊరట కలిగిస్తాయని సంతోషించారు . కానీ ప్రభుత్వ వైఖరి ఇప్పుడు వివిధ రకాల పింఛన్ల కొరకు వృద్ధులను , అర్హత కలిగిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది . 2018 ఎన్నికల్లో 57 ఏళ్ల వయస్సు వచ్చిన వారికి కూడా పింఛన్లు అందజేస్తామని కెసిఆర్ ప్రకటించడంతో తెలంగాణ ప్రజలు సంతోషించారు . సరైన పౌష్టికాహారం లేక 50 ఏళ్లకే వృద్ధాప్యం వచ్చి బాధపడుతున్న వారు ఇక ఈ పింఛన్ ఆసరాగా నిలుస్తుం దని భావించారు .

No asara pensions in Telangana ::

కానీ ఇప్పుడు 60 ఏళ్లు నిండిన పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు . పింఛన్ కొరకు దరఖాస్తులు చేసుకున్న వారు ప్రభుత్వ కార్యాల యాల చుట్టూ తిరుగుతున్నారు . ప్రతి మండలంలోనూ 57 ఏళ్లు నిండిన వారి సమాచారాన్ని సేకరించారు . అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉన్నా ప్రభుత్వం దీనికి సంబంధించి కార్యాచరణ ప్రకటించకపోవడంతో అధికారులు తమ చేతిలో ఏమీ లేదు . ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే ఇస్తాం తప్ప ఇప్పుడు మీరు మా కార్యాలయాలకు రావద్దంటూ తిప్పి పంపుతున్నారు . ఇక వితంతు , నేత , గీత , దివ్యాంగులు , ఒంటరి మహిళల పింఛన్లది కూడా ఇదే పరిస్థితి . చాలా కాలంగా పింఛన్ల మంజూరీని ప్రభుత్వం నిలిపివేసింది . ఇప్పటికైనా పింఛన్ల గురించి ఆలోచన చేసి తక్షణం పింఛన్లు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అర్హత కలి గిన వ్యక్తులు కోరుతున్నారు .

ఇక రేషన్ కార్డుల పరిస్థితి మరీ ఘోరం . నాలుగేళ్లుగా ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదు . తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కార్డు సరైన రీతిలో లేదు . రేషన్ కార్డు స్థానే మల్టీ పర్పస్ కార్డులను జారీ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు . వేరుప డిన కుటుంబాలకు చెందిన యువకులు , పిల్లలు రేషన్ కార్డులలో తమ పేరు నమోదు కాలేదని కొందరు , అసలు రేషన్ కార్డు రాక ప్రభుత్వ పరంగా సాయం పొందలేక మరి కొందరు ఇబ్బందులు పడుతున్నారు . రేషన్ కార్డు దరఖాస్తులు మండల కార్యాలయాల్లోని స్టోర్ రూముల్లో మూలుగుతున్నాయి .

ప్రభుత్వం ఇప్పటికైనా పింఛన్లు , రేషన్ కార్డుల మంజూరీపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరీ . ఖమ్మంజి ల్లాలో మొత్తం 160485 పింఛన్లు వస్తుండగా 57 ఏళ్లకే పింఛన్ పథకాన్ని అమలు చేస్తే దాదాపు దీనికి రెట్టింపయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు . ప్రతి దానికి మహా అయితే రూ . 10 కోట్లు , రూ . 20 కోట్లు అవుతాయని అంటూ ఊత పదంగా పలికే ముఖ్యమంత్రి ఇకనైనా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని దీంతో పాటు రేషన్ కార్డులను మంజూరు చేసి ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువులను పొందే అవకాశం కల్పిం చాలని ప్రజలు కోరుతున్నారు .

Related Articles

Back to top button