మరో రూపంలో ముంచుకస్తున్న వైరస్, Coronavirus virus new Avatar
‘ Coronavirus virus new Avatar కలకలం బ్రిటన్ , దక్షిణాఫ్రికాలలో కొత్త రకం కరోనా వైరస్ లండన్ విమానాలపై ఐరోపా దేశాల నిషేధం లండన్ : కొత్తరకం కరోనా వైరస్ ‘ స్ట్రెయిన్ ‘ ఐరోపా , ఆఫ్రికా దేశాల్లో కలకలం రేపుతోం ది . దక్షిణాఫ్రికా , బ్రిటన్‌లో ఈ స్ట్రెయిన్ వైరసన్ను శాస్త్రవేత్తలు గుర్తించారు . దీంతో ఐరోపాలోని ఇతర దేశాలు ఒక్కసారిగా అప్ర మత్తమయ్యాయి . బ్రిటన్లో ఈ స్ట్రెయిన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో నెదర్లాండ్స్ , బెల్జియం దేశాలు బ్రిటన్ నుంచి రవాణా సంబంధాలను నిలిపివేశాయి . బ్రి టన్ విమానాలపై నిషేధాజ్ఞలు విధించాయి . అలాగే బెల్జియం బ్రిటన్ నుంచి రైలుమా ర్గాన్ని కూడా ఆపివేసింది .
ఇటలీ , ఆస్ట్రియా దేశాలు సైతం బ్రిటన్ నుంచి వైమానిక సేవ లను నిలిపివేయాలని యోచిస్తున్నాయి . జర్మ నీ కూడా అదే బాటలో వుంది . చెక్ రిపబ్లిక్ వెంటనే స్పందించి , బ్రిటన్ విమానాలకు కటీఫ్ చెప్పింది . దక్షిణాఫ్రికా నుంచి రవాణా మార్గాలపై నిషేధం విధించాలని పొరుగుదే శాలు యోచిస్తున్నాయి . దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వైరస్ ను గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వేలి మఖాయిజ్ పేర్కొన్నారు . ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని , దేశంలో రెండో విడత మహమ్మారి విజృంభణను ఇది తీవ్రం చేస్తోందని తెలిపారు . ఈ కొత్త రకం వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని , అయితే ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు .
ఆరోగ్యపరంగా ఎలాంటి రుగ్మతలు లేనివారి పైన , యువతపైన కూడా కరోనా వైరస్ ఇటీవల ప్రభావం చూపుతోం దని మఖాయిజ్ చెప్పారు . కొత్త రకం కరోనా వైరకు ‘ 501.వీ 2 ‘ అని పేరు పెట్టామని ముఖాయిజ్ తెలిపారు . తమ దేశ జన్యుశాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారన్నారు . అయితే మొదటి రకం కరోనా వైరస్ కన్నా ఇది తీవ్ర అనారోగ్యం కలిగిస్తుందని ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలి పారు . కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో తిరిగి ఇన్ ఫెక్షన్లను కలిగి స్తుందా అన్నదాని పైనా ఇప్పుడే నిర్ధరణ చేయలేమని వివరించారు . బ్రిటన్ దేశంలో కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సుల భంగా వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రధాన వైద్యాధికారి తెలిపారు .
Coronavirus virus new Avatar ::
ఈ వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందన్నారు . బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరసన్ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు . అయితే ఈ కొత్తరకం వైరసన్ను వాక్సిన్ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన తెలిపారు . బ్రిటన్లో లా డౌన్ బ్రిటన్లోని పలు ప్రాంతాల్లో బోరిస్ ప్రభుత్వం మరోసారి పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించింది . కొత్తరకం కరోనా విజృంభణ వల్ల ఈ నిర్ణయం తీసుకుంది . కుటుంబాలతో కలిసి క్రిస్మస్ నిర్వహించుకునే వెలుగులు బాటును సైతం తొలగిస్తున్నట్లు వెల్లడించింది . ఈ వైరసను అరికట్టడా నికి లండన్ , దక్షిణ ఇంగ్లాండ్ సహా పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . వెంటనే ఈ లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు . ఇప్పటికే మూడు దశల లాక్ డౌన్ పద్ధతిని అవలంబిస్తున్న బ్రిటన్ .. లండన్‌లో ఇప్పటికే మూడో దశను అమలులోకి తీసుకొచ్చింది .
తాజాగా నాలుగో టైర్ లాక్ డౌనను ప్రవేశపెట్టింది . దీని ప్రకారం అత్యవసరం కాని వ్యాపా రాలన్నీ మూసేయాల్సి ఉంటుంది . మరోవైపు క్రిస్మస్ పై ఈ లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపనుంది . మూడు కుటుంబాలు కలిసి పండుగ నిర్వ హించుకునేలా అవకాశం కల్పించనున్నట్లు ఇదివరకే ప్రధాని ప్రకటిం చగా .. టైర్ 4 లాక్ డౌన్ ఉన్న ప్రాంతాల్లో ఈ వెసులుబాటు ఉండదని తాజాగా స్పష్టం చేశారు . ఈసారి క్రిస్మసను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వ హించుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు . ఇదిలావుండగా , ఇటలీలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటం వల్ల మరోసారి పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు . క్రిస్మస్ నేపథ్యంలో ప్రజలు బహిరంగంగా గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది . డిసెంబర్ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెజోన్ ప్రకటించారు . ఈ లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర పనుల నిమిత్తం తప్ప బయట తిరిగేం దుకు అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది . క్రిస్మస్ నేపథ్యంలో యూరప్ దేశాలైన జర్మనీ , నెదర్లాండ్లు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటిం చాయి .