బీజేపీ కి కలిసచ్చే విషయాలు, BJP will beat TRS

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత BJP will beat TRS మొదటి సారిగా తెరాస కార్యకర్తలలో ఇటీవలి కాలంలో ఆత్మపరిశీలన మొదలైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు . ప్రతి నియోజక వర్గంలో శాసన సభ్యులు , మంత్రులతో మానసికంగా దూరం అయిన తెరాస కార్యకర్తలను ఆకర్షించడానికి బిజెపి అనుబంద సంఘాల ప్రతినిధులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు . మొన్నటి దుబ్బాక , గ్రేటర్ హైదారాబాద్ ఎన్నికల తరువాత తెరాస నాయకత్వంలో మార్పు వస్తుందని , ఉద్యమంలో మనసా వాచా పనిచేసిన వారికి గుర్తింపు వస్తుందని తెరాస శ్రేణులు ఆశిస్తున్నాయి . రాబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు తెరాస లోని అసంతృప్తికి ఫైనల్ ఫలితాలుగా పరిశీలకులు భావిస్తున్నారు . రెండు ఎన్నికల్లో అనుకోని విజయం సాధించిన బిజెపి నాయకత్వంతో పాటు , కార్యకర్తలు కొత్త ఉత్సాహంతో పార్టీని బలపరచడానికి గ్రామ స్థాయి నుండి తెరాస్సా , కాంగ్రెస్ శ్రేణులను , నాయకులను ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు .

సిద్ధాంతాలు ఎలా ఉన్నా , స్థానికంగా అసంతృప్తిగా ఉన్న వారిని , చిన్న సమూహా సమావేశాలు ఏర్పాటు చేసి తమ ఆలోచనలను పంచుకొంటున్నారు . బిజెపి అనుబంధ సంస్థలతో పాటు , సిద్ధాంత సంస్థ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు తమ శక్తి మేర పూర్వ పరిచయాలను , ఇతర సంబంధాలను ఆదారం చేసుకొని , తెరాస శ్రేణులను ఆకట్టుకొనే విధంగా పావులు కదుపుతున్నాయి . రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో తెరాస ఓడిపోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఇప్పట్లో ఏమి లేకున్నా , 2023 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే క్రియాశెలకంగా వ్యవహరిస్తున్నారు . మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్నీ శాసన సభ్యుల మాట మీదనే ఆధారపడి ఉండడం , కొంత మంది శాసన సభ్యులు కింది స్థాయి నాయకులను , కార్యకర్తలను పట్టించుకోక పోవడతో విసుగు చెందిన వారు ప్రక్కదార్లు చూస్తున్నారని భావిస్తున్నారు . చాప కింది నీరులా , బిజెపి ఒక్కొకారిణి తనవైపుకు లాక్కోవాలని చూస్తుంది .

BJP will beat TRS

ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా శాసన సభ్యుల కనుసన్నలలోనే పని చేయడం , ప్రతి చిన్న దానికి శాసన సభ్యుని బతిమాలదాల్సిన పరిస్తితి రావడంతో విసిగిపోయిన కింది స్థాయి నాయకులు , కార్యకర్తలు తమ స్వాభిమానం దెబ్బతింటుందని భావిస్తున్నారు . ఈ విషయాన్ని చెప్పుకోవడానికి పార్టీలో కానీ , ప్రభుత్వంలో కానీ సరియైన వ్యవస్థ లేకపోవడం , జిల్లా మంత్రులు కూడా చేతులెత్తేయడంతో పార్టీ శ్రేణులు నిరాశ చెంది ఉన్నాయి . పార్టీ నిర్మాణం పూర్తిగా నిర్వీర్యం కావడంతో , శాసన సభ్యుడే కీలకమై పోయాడు . సర్పంచ్ లు , మండలాధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్మన్ లు , మున్సిపల్ ఛైర్మన్ లతో సహా అందరూ గుర్తింపులేని కూలీలుగా మారిపోయామని ఆవేదన చెందుతున్నారు . అభివృద్ధి పనులకు తగినన్ని నిధులు రాకపోవడం కూడా గ్రామాలలో అనేక విమర్శలకు తావిస్తుందని నాయకులు బాదపడుతున్నారు .

పనులు కానపుడు అధికార పార్టీలో ఉన్నా , ప్రతిపక్ష పార్టీలో ఉన్నా వచ్చే నష్టం ఏమిటని ప్రశించే కార్యకర్తలకు నాయకులు జావాబు చెప్పలేక పోతున్నారు . గ్రామాలలో ఇసుక దందా నుండి పోలీస్ స్టేషన్ , ఏం ఆర్ ఓ కార్యాలయం వరకు శాసన సభ్యుని సూచనల మేరకే కార్యకర్తలకు పనులు జరగడం , కింది వారికి అసలు కనీస గౌరవం కూడా దొరకని స్థితిలో , ప్రతిపక్ష పార్టీల వారి ముందు నవ్వులపాలౌతున్నామని కార్యకర్తలు కనబద్ద నాయకుని ముందు తమ ఆవేదనను వెళ్లబోసుకొంటున్నారు . ఈ నేపథ్యంలో బిజెపి మండల స్థాయి నాయకులను ముందుగా తమ వైపుకు తిప్పుకోవడానికి పావులు కడుపుతుంది .

తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో ఒకరు పార్టీ అధ్యక్షుడు కావడం , ఆయన మొదటి నుండి సామాన్య కార్యకర్తగా ఉండి , అందరితో క్షేత్ర స్థాయి పరిచయాలను కలిగి ఉండడంతో పాటు , చాలా మంది తెరాస వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు . బలహీన వర్గాలకు చెందిన ఇద్దరితో పాటు , గిరిజన తెగకు చెందిన అదిలాబాద్ ఎంపీ కూడా తెరాస నుండి అసంతృప్తులనే కాకుండా , ఆశించిన ప్రయోజనాలు పొందని వారిని కూడా మచ్చిక చేసుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు .

BJP will beat TRS

గత శాసన మండలి గ్రాడ్యుయేట్ స్థానానికీ జరిగిన ఎన్నికల్లో కొంత మేర నిస్త్రాణంగా ఉన్న బిజెపి అనుబంధ సంఘాల కార్యకర్తలు , నాయకులు మళ్ళీ ఇప్పుడు పునరుత్తేజి తులైనట్లుగా కనబడుతుంది . ఎమర్జెన్సీ బాధితుల నుండి మొన్నటి ఉద్యమంలో పాల్గొని చిన్నచూపు చూడబడుతున్న ప్రతి వ్యక్తిని కలుపుకొని పార్టీని బలపరచాలని పనిచేస్తున్నారు . నిరుద్యోగ , ఉద్యోగ , ఉపాధ్యాయ వర్గాలలో ఉన్న అసంతృప్తిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని వీరు చూస్తున్నారు . బిజెపికి గ్రామంలోని భూత్ స్థాయి నుండి జిల్లా వరకు వివిధ కమిటీలు ఉన్నాయి . అంతకంటే ఎక్కువగా పార్టీలో కొత్త నాయకత్వం దూకుడు పట్ల నమ్మకం పెరుగుతుంది . మొదటి నుండి యువతలో ఎక్కువ భాగం విద్యావంతులు , సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బిజెపి ప్రచారానికి లొంగిపోయారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు . కోరోనా వల్ల రాష్ట్రం నిధుల కొరతను ఎదుర్కొనడం కూడా కొంత ప్రతికూలతకు కారణం .

కొత్తగా ఎన్నికైన మున్సిపల్ , జిల్లా పరిషత్ అధ్యక్షులు గ్రామాలలో అభివృద్ధి పనులు చేయలేక అవస్థలు పడుతున్నారు . ప్రభుత్వం నుండి సామనాయులకు అందే కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ , ముఖ్యమంత్రి సహాయ నిధి లాంటి చిన్నచిన్న అంశాలను కూడా నియోజకవర్గం మొత్తం కట్టగట్టుకొని శాసన సభ్యుని కనుసన్నలలోనే నడవడం , వీరికి ఇందులో ఎలాంటి ప్రమేయం లేకపోవడం కూడా వీరిని నిరుత్సాహానికి గురిచేస్తుంది . పార్టీని క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణం చేసి , స్థానిక నాయకులకు తగిన గౌరవం కల్పించాలని కార్యకర్తలు కోరుకొంటున్నారు . రాష్ట్ర స్థాయిలో అందరికీ పదవులు ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదనే విషయాన్ని గ్రహించిన పార్టీ శ్రేణులు , స్థానికంగా ఉండే వాటిలోనైనా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకోవడం వారి అత్యాశకాదని భావించాలి . ప్రతి జిల్లాలో , శాసన సభా నియోజక వర్గంలో చిన్న చిన్న దేవస్థాన పదవుల నుండి మార్కెట్ కమిటీ , వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉండే సలహా మండలి సభ్యుల నియామకం విషయంలో శాసన సభ్యులు నిరాసక్తత చూపడం , కానివారికి , పార్టీ ద్రోహులకు పెద్ద పీఠ వేయడం కూడా కార్యకర్తలను బిజెపి వైపు మల్లిస్తుంది . శాసన సభ్యులా పట్ల ఉన్న వ్యతిరేకతను పార్టీ అధిష్టాన వర్గం గ్రహించి , పార్టీ పునర్నిర్మానానికి పూనుకోకుంటే , రాబోయే రోజుల్లో బిజెపికి మరింత లాభం చేకూర్చిన వారవుతారు .

Related Articles

Back to top button