దెబ్బకు దిగొచ్చారు Bangladesh prime minister comments

భారత మా నిజమైన మిత్రుడు బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఢాకా : Bangladesh prime minister comments భారత్ తమ నిజమైన మిత్రు డని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గురువారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పేర్కొన్నారు . పాకిస్తాన్‌కు వ్యతిరేకం గా జరిగిన 1971 విముక్తి పోరాటంలో సహకరించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు . ఇక ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా భారత్- బంగ్లాదేశ్ ఏడు ఒప్పందాల మీద సంతకాలు చేశాయి . ఇద్దరు ప్రధానుల మధ్య వర్చువల్ గా శిఖరాగ్ర సమావేశం జరిగింది . విజయోత్స వ మాసంలో జరిగిన సమావేశం తనకెంతో సంతోషం కలిగించిందని హసీనా వెల్లడించారు . పాకిస్తాన్ మీద విజయానికి గుర్తుగా బుధవారం నాడు బంగ్లాదేశ్ 49 వ వార్షికోత్సవం నిర్వహించింది . భారత్ మద్దతుతో 1971 డిసెంబర్ 16 నాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో యుద్ధంలో గెలిచింది . అలా డిసెంబర్ బంగ్లాదేశ్ ప్రజల దరికీ ఉత్తేజకరమైన , స్వాతంత్ర్య స్ఫూర్తి వెల్లివిరిసేలా చేస్తుందని , జాతిపిత , బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్‌కు అంజలి ఘటిస్తూ ఆయనను స్మరించుకుంటామని , “ భారత్ మా నిజమైన మిత్రుడు ” అని పేర్కొన్నారు హసీనా .

Bangladesh prime minister comments

బుధవారం భారత్ కూడా 1971 యుద్ధంలో విజయానికి గుర్తుగా 50 ఏళ్ల వేడుకలను ప్రారంభించింది . డిసెంబర్ 16 ను బంగ్లాదేశ్ ‘ బిజోయ్ దిబోష్ ” గా ( విజయ్ దివస్ ) నిర్వహిస్తుంది . విముక్తి వ్యతిరేక శక్తుల మీద బంగ్లాదేశ్ చారిత్రక విజయం మనకు గర్వకారణం అన్నారు మోడీ . బంగ్లాదేశ్ 49 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు దేశాల తరఫున ప్రాణాలు అర్పించిన సైనికులకు ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు . 50 ఏళ్ల దౌత్య బంధం వివిధ రంగాల్లో సహకార విస్తరణకు , 1965 వరకు ఉనికిలో ఉన్న సీమాంతర రైలు మార్గాన్ని పునరుద్ధరించడం మీద భారత్ , బంగ్లాదేశ్ మొత్తం ఏడు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి .

ఈ సందర్భంగా ఇద్దరు ప్రధానులు భారత్ లోని కూచ్ బిహార్ ( హల్దీబాడి ) , బంగ్లాదేశ్ లోని చిలాహా టి మధ్య రైలు మార్గాన్ని ప్రారంభించారు . మొత్తానికి 2020 లో రెండు దేశాలు కూడా రైలు మార్గాల ద్వారా వ్యాపారం , ఉన్నత స్థాయి పర్యటన లు , సమావేశాలు , సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు , కోల్ కతా నుంచి ఈశాన్య భారతదేశానికి బంగ్లాదేశ్ గుండా మొదటి భారతీయ కార్గో రైలు ప్రయోగ ప్రయాణం , అన్నింటికీ మించి కొవిడ్- 19 మీద సహకారం లాంటి వాటికి సాక్ష్యులుగా ఉన్నాయని హసీనా వ్యాఖ్యానించారు . బుధవారం బంగ్లాదేశ్ 50 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకొందని , అలాగే భారత్ తో 50 ఏళ్ల దౌత్య బంధంలోకి అడుగుపెట్టిందని ఆమె గుర్తుచేశారు . 2021 మార్చి 16 నాటి ఉత్సవాలకు థాకా రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు . దీనికి మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు . 1971 యుద్ధంలో అమరులైన భారత సైనికులకు కూడా హసీనా శ్రద్ధాంజలి ఘటించారు . రెండు దేశాలు వివిధ అనుసంధాన , మౌలిక వస తుల పథకాలతోపాటు వ్యాపార , ఆర్థిక కార్యకలాపాలను పెంచు కున్నా యి .

Related Articles

Back to top button