రైతుల పై భాష్ప వాయువు ప్రయోగం, Farmers protest in delhi
Farmers protest in delhi : కేంద్రంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు , ఎంపి రాహుల్ గాంధీ మరో మారు విరుచుకుపడ్డారు . ప్రధాని నరేంద్రమోడీ అహంకారం వల్ల ఓ వృద్ధరై తుపై జవాన్ లాఠీని ఝుళిపించాల్సి వస్తుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు . కార్పొరేట్ ఆఫీసులలో ఫొటోలకు ఫోజులివ్వడానికి బదులు ఆందో ళన చేస్తున్న రైతులతో ప్రధాని చర్చలు జరిపితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ సూచించింది . దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఆందోళ నకు సంబంధించిన పలు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతు న్నాయి . రైతులను నిలువరించే క్రమంలో ఓ రైతు పై జవాన్ లాఠీ లేపిన ఫొటో ఒకటి పలువురి దృష్టిని ఆకర్షించింది . దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు . ఆ ఘటన తనని తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు .
Farmers protest in delhi
“ బాధాకరమైన చిత్రం : జై జవాన్ .. జై కిసాన్ అన్నది మన నినాదం . కానీ , ఈ రోజు ప్రధాని మోడీ అహంకారం వల్ల రైతులకు జవాన్లు వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తోంది . ఇది చాలా ప్రమాదకరం ” అని రాహుల్ ట్వీట్ చేశారు . పంజాబ్ , హర్యానాకు చెందిన రైతులు కొత్త వ్యవసాయ చట్టా లకు వ్యతిరేకంగా తమ నిరసనను కొనసాగిస్తున్నారు . ‘ చలో ఢిల్లీ ‘ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అనేక మంది రైతులు జాతీయ రహదారిపై వాహ నరాకపోకలను అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీ రోడ్లపై ఆందోళన చేస్తుంటే మోడీ మాత్రం కార్పొరేట్ కార్యాలయాల్లో ఫొటోలకు ఫోజులిస్తున్నా రని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్దేవాలా ఆరోపించారు . విమానాల్లో ప్రయాణం చేయడానికి బదులు రోడ్కెక్కిన రైతులను ఆహ్వానించి ప్రధాని చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు .
ఈ మేరకు సుహ్రావాలా ట్వీట్ శనివారం ట్వీట్ చేశారు . కొవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో నిగమ్నమైన అహ్మదాబాద్ లోని ఓ కంపెనీని మోటీ పర్యటించిన తరువాత సుర్దేవాలా పై విధంగా వ్యాఖ్యలు చేశారు . మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారందరినీ ఉగ్రవాదులుగా పరగణిస్తున్నారని మరో అధికార ప్రతి నిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు . తమ నిజమైన సాదకబాధకలను వ్యక్తం చేస్తున్న పేద పంజాబ్ రైతులను ఖళీస్తానీలుగా ముద్రవేస్తున్నారని , ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రధాని ఎందుకు స్పందిచడం లేదని ఆయన నిలదీశారు . ఇదిలా ఉండగా , పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా నిరసన తెలియజేసేందుకు ఢిల్లీ వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డు కుంటున్న చిత్రాలను ట్వీట్ చేశారు . హైదరాబాదు