మల్లన్న పాదయాత్రలో ఆసక్తికర వ్యాఖ్యలు, Teenmar mallana roadshow

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నా రని Teenmar mallana roadshow పేద బడుగు , బలహీన వర్గాలను , నిరుద్యోగ యువతను ఉద్యోగులను అనునిత్యం ఇచ్చిన వాగ్దానాలను విస్మ రించి మోసం చేస్తున్నాడని ఈనియంత పాలన ప్రజావ్యతిరేఖ విధానాలను ఎండ గట్టారు . అందుకే ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని ప్రజలను రాజులను చేయ డానికి నాయొక్క పాదయాత్ర ఓటు కొ సం కాదు నాజీవితం ప్రజల కోసమేనని ఉద్యమాల పోరుగడ్డ జనగామగడ్డ నుండి తన పాదయాత్ర మొదలు పెడుతున్నా నని అన్నారు .

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన బిక్షవలనే నేడు పేద , బడుగు , బలహీన వర్గాల కోసం తన పోరాటం జనగామ నుండి 50 రోజుల వరకు ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతూ ప్రజా సమస్యలపై అనునిత్యం ప్రభుత్వా న్ని నిలదీస్తూ పరిష్కార దిశలో కేసిఆర్ కళ్లు తెరిపించే అందుకే ప్రజల పక్షాన నిరు ద్యోగ యువత పక్షాన యుద్దానికి సిద్ధం అయ్యామని పేర్కొన్నారు . ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాద యాత్ర మొదలు పెట్టారు . ఈ సందర్భం గా ఖమ్మం , వరంగల్ , నల్గొండ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు పెద్దఎత్తున యువత పాల్గొనడం విశేషం . ఆయన మాట్లాడుతూ తెలంగా ణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు యు వత ప్రాణత్యాగం చేస్తే నాడు ప్రజలు కల లుగన్న తెలంగాణ నేడు కేసిఆర్ కుటు ంబ పాలనకు కొనసాగిస్తూ ప్రజల నిరు ద్యోగ యువత అమరుల త్యాగాలను వి స్మరించడమే కాకుండా నాడు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసిఆర్ అప్పు ల రాష్ట్రంగా మార్చి ప్రజలను బిక్షమొ త్తుకునే విధంగా చేశాడని ధ్వజమెత్తారు .

Teenmar mallana roadshow ::

నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకు డోకా ఉండదని నేను కాపలా కుక్కలా చూసుకుంటానని , కానీ ఇప్పుడు ప్రజల సమస్యలు పట్టని ప్రశ్నించే గొంతుపై ఉక్కు పాదం మోపి నియంత అయ్యాడని పే ర్కొన్నారు . రాష్ట్రంలో ఒక్క ఇంటిలో ‘ నే ఒకే ఆసరా పెన్షన్ కానీ , కేసిఆర్ ఇంట్లో మాత్రం రెండు పదవులు ఎందుకని పేర్కొన్నారు . కేసీఆర్ రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని , అయితే ఈ నిరుద్యోగ యువత ఎందుకు గగ్గోలు పెడుతున్నా రని ఎద్దేవ చేశారు . గతంలో తెలంగామ రాష్ట్రం కోసం పోరాటంలో కోదండరాం బహటంగానే మాట్లాడడం జరిగిందని , రాష్ట్రంలోని ఇంత జరుగుతున్నా మాట్లాడకపోవడం గత ఎన్నికల్లో కేసిఆర్ తో చీకటి ఒప్పం దం చేసుకొని టీఆర్ ఎస్ పై డమ్మి అభ్యర్థి అని ఆయన పేర్కొన్నారు . అదేవిధంగా ఖమ్మం , వరంగల్ , నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రావు కేసిఆర్ కు ఒక డమ్మిగా అంతర్గతంగా కోదండరాంను గెలిపించాడనికి చూస్తున్నారని అన్నారు .

ప్రభుత్వం ఉద్యోగస్తులను చిన్నచూపు చూస్తూ మోసపూరిత మైన హామీ ఇవ్వడమే కాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు పిఆర్ సీ ఎందుకు ఇవ్వలేదని అంతేకాకుండా విద్యార్థులు ఉద్యోగా ల కోసం పై చదువులు ముగించుకొని నిరుద్యోగ యువత ఇటు కుటుం బానికి చెప్పుకోకుండా ఉద్యోగాలు రాని పరిస్థితి ఈ కేసిఆర్ తీసుకువచ్చాడని అలాంటి ప్ర భుత్వానికి మేధావులు ఈ ఎ మ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పే విధంగా తనను గెలిపించాలని తమ స మస్యలను పరిష్కరించకపోతే రెం డున్నర సంవత్సరాల్లోనే తాను రాజీ నామా చేస్తానని ఆయన పేర్కొన్నారు . ఈ పాదయాత్రలో పెద్దఎత్తున యువత పాల్గొనడం జరిగింది .

Related Articles

Back to top button