మల్లన్న పాదయాత్ర లో సంచలన వ్యాఖ్యలు, Teenmar mallana comments

సర్కార్ పై ఎమ్మెల్సీ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న ఫైర్ ఫైర్ అయ్యారు. Teenmar mallana comments రఘునాధపల్లి లో ఆయన పాదయాత్ర లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ తన కుటుంబంలోనే కొలువులు ఇప్పించు కున్నారని , ఆ ఒక్క కుటుంబంలో నెలకు 16 లక్షల 80 వేల జీతాలు తీసుకుంటున్నారని తీన్మార్ మల్ల న్నదుయ్యబట్టారు .

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జనగాం జిల్లా లోని నర్మెట నుంచి ఖిలాషాపూర్ మీదుగా రఘునా థపల్లి మండలానికి పాదయాత్రతో చేరుకున్నారు . కేసీఆర్ కుండలు పెట్టి బగోన్లు ఎత్తుకుపోతున్నరని ఆరోపించారు . ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని కేసీఆర్ .. ఆయన కూతుర్ని మాత్రం ఎమ్మెల్సీగా చేసి ఉద్యోగం ఇప్పించుకున్న డని ఎద్దేవా చేశారు . రాష్ట్రంలో దొరల పాలన తె చ్చిండని , తలమ్మి చెప్పులు కొన్న చందంగా పాలన నడుస్తోందని మండిపడ్డారు . మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి .. రాష్ట్రంల ఒక్కొక్కరి నెత్తి మీద 80 వేల అప్పు పెట్టిండని ఫైర్ అయ్యారు . అన్నింటి రేట్లు పెంచుతున్నరు Teenmar mallana comments “ రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నడని సంబురపడుతున్నరు . కానీ , అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతున్నడు . కేసీఆర్ ఫాంహౌస్ లపండుకుని రోజుకు రూ .18 వేలు తీసుకుంటున్న డు . ప్రభుత్వం అవినీతిమయం అయింది . రాష్ట్రం వచ్చినంక కూడా మన బతుకులు మారదా ? ” అని మల్లన్న ప్రశ్నించారు .

టీఆర్ఎస్ నుంచి పల్లా రా జేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే కట్టప్ప లెక్క చట్ట సభలకు పోతాడని చెప్పను కానీ , గెలిపించినంక ఏంజేయలే దని మండిపడ్డారు . ఇప్పటికే ఉస్మానియా , కాకతీయ యూనివర్సిటీలను ఆగం జేసి అనురాగ్ యూనివర్సి టీని డెవలప్ జేసుకున్నాడని ఆరోపించారు . తనను గెలిపిస్తే నిరుద్యోగులు , పేదల గొంతుక అవుతాన ని , పనీ జేయకపోతే రెండున్నరేండ్లలో రాజీనామా చేస్తానని మల్లన్న అన్నారు . తాను ఎవరికీ భయప డేది లేదని , ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నానని అన్నారు . మల్లన్న పాదయాత్రలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

Related Articles

Back to top button