మళ్లీ సింగరేణి సమ్మె, Singareni employees strike

26 న దేశ వ్యాప్త సారవత్రిక సమ్మెలో Singareni employees strike బొగ్గుగని కార్మికులు కేంద్రంలోని బీజేపీ , ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా సారవత్రిక సమ్మె నవంబరు 28 న జరగనుండగా ఇందులో బొగ్గగని కార్మికులు కూడా పాల్గొంటున్నారు . ఐఎన్టీయూసీ , ఐఐటీయూసీ , హెచ్ఎంఎస్ , సీఐటీయూ , ఐఎఫ్ టీయూలోని రెండు యూనియన్లు ఏఐయూటీయూసీ , టీఎన్ టీయూసీ , టీఆర్ఎస్ కేయూ యూనియన్లు తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణిలో నవంబరు 28 న సమ్మెకు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది .

కనీస వేతనం 21 వేల రూపాయలు ఇవ్వాలని , కార్మిక వ్యతిరేక కోలను , రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరిం చుకోవాలని కాంట్రాక్టు విధానాలను రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి . ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేసి కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు . ప్రభుత్వ రంగ సంస్థలైన బొగ్గు , ఇన్సూరెన్సు , రైల్వే , బ్యాంకు , రక్షణ విభాగాలతో పాటు ఇతర ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించే యోచనను ఉపసంహరించుకోవాలని , స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని , ప్రభుత్వ , విద్య , ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ , కరోనా వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయాలని , పేద ప్రజలం దరికి మనిషిక పది కిలోల చొప్పున బియ్యం అందజేయాలని , నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరి రచాలని , ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు పెన్షన్ కింద వ్వాలని , గ్రామీణ ఉపాధిహా మి పథకంలో రోజుకు రూ . 600 లు చెల్లించాలని , పట్టణ ప్రాంతానికి ఈ స్కీంను విస్తరించాలని యూనియన్లు కోరుతున్నాయి .

Singareni employees strike ::

ఆదాయపు పన్ను పరిధిలోనికి రాని ప్రతీ కుటుంబానికి రూ . 1,500 లు ఇవ్వాలని , దళితులు , మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని , మహిళలు పని చేసే ప్రదేశాల్లో రక్షణను పకడ్బందీగా అమలు చేయాలని మహిళలపై లైంగిక వేదింపులు అరికట్టాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి . రైతాం గానికి , దేశ ప్రజలకు ముప్పు వాటిల్లే విధంగా వారి జీవితాల చిన్నాభిన్నమయ్యే విధంగా ఎన్నో చట్టాలను బిల్లులను బీజేపీ ప్రభత్వం తీసుకువస్తున్నదని యూనియన్లు పేర్కొంటున్నాయి . కార్పోరేటు కాంట్రాక్టు వ్యవసాయాన్ని , ఆహార ప్రాసెసింగ్ లో దేశ విదేశ సంస్థలను కేంద్రం పోత్రహిసున్నది . దేశ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టుతున్నది . విద్యుత్ సవరణ 2020 బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే విద్యుత్ పంపిణీని ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రారంభించింది . 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిని వ్యతిరేకిసు న్నప్పటికి కేంద్రం పట్టించు కోవడం లేదు . బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు , కార్మికుల రైతుల , సామాన్య ప్రజల ప్రజాస్వామ్య రాజ్యాగం హక్కుల మీద చేసు న్న దాడిని తిప్పికొట్టడానికి యూనియన్లు సిద్ధమయ్యాయి , ప్రభుత్వ భాగస్వామ ఎలతో సంప్రదింపులు జరిపే విధానాన్ని పూర్తిగా విస్మరించి ఆర్థిక మందగమనాన్ని , అన్ని సూచికలు తెలియజేస్తున్నప్పటికి వ్యాపారం సులభతరం అనే పేరుతో ప్రభుత్వం తమ విధానాలను కొనసాగిస్తూనే ఉంది . ప్రభుత్వ విధానాల వల్ల పేదరికం దేశంలో పెరిగిపోతూ ఉంది .

20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు జనాభా పేదరింకంలోకి నెట్టబడింది . పేదరికం తగ్గే బదులు కరోనా మహమ్మారి నేపథ్యంలో వలస జీవులకు ఉపాధి లేకుండా పోవడం , తిండి కూడా దొరకలేని పరిస్థితితో నిరుపేదల , కష్టజీవుల బతుకులు మరింత అధ్వాన్నంగా మారాయి . వలస జీవలు ఉపాధిలేక ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయ బడ్డారు . కార్పోరేటు పన్నులను తగ్గించడంతో పాటు మూడు కార్మిక వ్యతిరేక చట్టాలను , ప్రతిపక్షాలు పార్లమెంటులో లేని సందర్భం చూసి ఆమోదిం చుకున్నారు . అసంఘటిత రంగంలోని వీధి వ్యాపారులు , మద్యాహ్న భోజన కార్మికులు , బీడీ కార్మికులు , ఇంటి పనివారు , నిర్మాణ రంగంలోని కార్మికులు , ఆటోరిక్షా కార్మికులు , ఇలా బొగ్గుగనిలో పనిచేస్తున్న 2 లక్షలకు పైగా కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ కార్మికులు , కార్మిక చట్టాలను ఏర్పర్చడం వల్ల రక్షణ లేని పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నారు . ఇలాంటివెన్నో ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 23 , 24 , 25 తేదీలలో ఏఐసీటీయూ ఆధ్వర్యంలో జీపుజాత , ఈ నెల 8 న రౌండ్ టెబుల్ సమావేశాలను కార్మిక సంఘాలు ఏర్పాటు చేశాయి . ఈ నెల 9 న సింగరేణిలోని బొగ్గుబావుల్లో నల్ల బ్యా డీలతో కార్మికుల నిరసన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు . సారవత్రిక సమ్మెను విజయవంతంచేయడం కోసం కార్మిక సంఘాల నాయకులు బొగ్గు గనుల బాట పట్టారు . ప్రభుత్వ ప్రైవేట రంగాలలోని అన్ని పరిశ్రమల కార్మికులు సారవత్రిక సమ్మెలో పాల్గొనాలని యూనియన్ల నాయకులు పిలుపునిచ్చారు .

Related Articles

Back to top button