Trending

గెలిచాక రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు, Raghunandan rao victory speech

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం Raghunandan rao victory speech సిఎం కెసిఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు . బిజెపి ఎక్కడుం దని టిఆర్ఎస్ నేతలు ప్రశ్నించారని , గజ్వేల్ , సిరిసిల్ల , సిద్దిపేటలకు ఒకటి రెండు కిలో మీటర్ల దూరంలోనే బిజెపి ఉందని అన్నారు . దుబ్బాక ప్రజలు చైతన్యంతో ఓటు వేసి టిఆర్ఎస్ నేతల అహంకారాన్ని దించారని , వారికి గుణపాఠం చెప్పారని ఆయన వ్యాఖ్యా నించారు .

దుబ్బాక విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు . ఇప్పటికైనా ప్రజాస్వామ్య యుతంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయాలని , లేనట్లయితే టిఆర్ఎస్ తెరమరుగు కావడం ఖాయమన్నారు . బిజెపి విజయానికి కారణమైన దుబ్బాక ప్రజలకు , బిజెపి కార్యకర్తలకు బిజెపి కృతజ్ఞతలు తెలియజేస్తుంద న్నారు . దుబ్బాకలో బిజెపి అభ్యర్థి ఎం.రఘునందన్ రావు విజయం అనం తరం హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరి గిన మీడియా సమావేశంలో బండి సంజయ్ , కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి , పార్టీ ఉపాధ్యక్షులు డి.కె.అరుణ మాట్లాడారు .

Raghunandan rao victory speech ::

టిఆర్ఎస్ ఓట్లను కొను గోలు చేసి గెలిచే ప్రయత్నం చేసిందని , దుబ్బాక ప్రజలు బిజెపిని నమ్మి ఓటేసి గెలిపించారని బండి సంజయ్ అన్నారు . అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి అని టిఆర్ఎస్ ప్రచారం చేసిందని , టిఆర్ఎస్ కులాల పేరుతో ప్రజలను విభజించిందని , బిజెపి కార్యకర్తలను టిఆర్ఎస్ ఇబ్బం దులకు గురిచేసిందని చివరకు ప్రజలు బిజెపిని విశ్వసించారన్నారు . ప్రజలు ప్రశ్నిస్తారనే సిఎం దుబ్బాకలో ప్రచారం చేయలేదన్నారు . యువ కుల దమ్మేంటో టిఆర్ఎస్కు చూపించారు . తెలంగాణ అమరులను స్మరించుకోవాల్సిన సిఎం కెసిఆర్ నిజాం కాళ్ళ దగ్గర మొకరిల్లారని ఆయన ఆరోపించారు . సర్దార్ పటేల్ కు నివాళులు అర్పిస్తామంటే పర్మిషన్ ఉందా అని పోలీసులు అడుగుతున్నారన్నారు . తెలంగాణ రాష్ట్రంలో అధి కారమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు . దుబ్బాక ఫలితమే జిహెచ్ఎంసిలో రిపీట్ అవుతుంది దుబ్బాక ఫలితమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పునరావృతం కానుందని బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు .

దుబ్బాక గెలుపు అమరుడు శ్రీని వాసకు అంకితమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రక టించారు . జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు . దుబ్బాకలో పార్టీ అభ్యర్థి విజయం సాధించిన అనంతరం హైద రాబాద్ లో పార్టీ నేతలతో కలిసి బండి సజయ్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు . దుబ్బాక ప్రజలు టిఆర్ఎస్ కు బుద్ది చెప్పారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు . టిఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టి బిజెపి జండా పాతారన్నారు . దుబ్బాక ఫలితం తో అమర వీరుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు . తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో తామే విజయం సాదించినట్టు సంతోషంగా ఉన్నారన్నారు . ఉప ఎన్నికలు జరి గిన చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందని , ఎక్కడ కూడా టిఆర్ఎస్ వ్యవహరించినంత అరాచకంగా వ్యవహరించలేదన్నారు .

తెలంగాణాలో ప్రభుత్వం బిజెపి పై చేసిన దౌర్జన్యం తాను ఎక్కడ చూడలేదన్నారు . బిజెపి వాహనాన్ని తనిఖీ చేస్తుంటే పక్క నుండి పది టిఆర్ఎస్ నేతల వాహనాలు వెళ్లినా ఆపలేదన్నారు . కొందరు అధికారులు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ శాశ్వతం అనుకుంటున్నారని , అతిగా వ్యవహరిస్తున్నారని , అధికారులు , పాలకులు ఎలా వ్యవహరిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నార న్నారు . బిజెపి కార్యకర్తలు ఇంకా జైళ్లలో ఉన్నారని , సోమవారం పోలీ సులు కస్టడీ లోకి తీసుకుని జైలుకి పంపించారని కిషన్ రెడ్డి తెలిపారు . దుబ్బాక ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నామని , బిజెపి కార్యకర్తల ను కడుపులో పెట్టుకున్నారన్నారు . డి.కె.అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , బిజెపి వైపు చూస్తున్నారన్నారు . ఇందుకు ఉదాహరణ దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి విజయం సాధించడమే నని ఆమె పేర్కొన్నారు .

Related Articles

Back to top button