ఎక్స్ రే గురించీ మీకు తెలియని విషయాలు, Facts about X-ray

నవంబర్ 1895 ‘ ప్రొఫెసర్ విల్ హెమ్ కాన్ రాడ్ రాంటిజెన్ ‘ అవిష్కరించిన Facts about X-ray ఎక్స్ రే ( X రే ) వికిరణాల ఫలితంగా ప్రపంచ వైద్యరంగంలో రోగ నిర్థారణ మరియు చికిత్స అందించడంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకు న్నాయి . ఎక్స్ రే వికిరణాలను కనుగొన్న సందర్భానికి గుర్తుగా 2007 నుంచి ప్రతియేటా 08 నవంబర్ రోజున ప్రపంచ రేడి యోగ్రఫీ దినం పాటించుట ఆనవాయితీగా మారింది . విద్యు దయస్కాంత వికిరణాలలో శక్తివంతమైన వికిరణాలుగా ఎక్స్ రే ( X వికిరణాలు ) లకు ప్రాధాన్యత ఉన్నది . అధిక శక్తిగల వికి రణాల సహాయంతో పలు ధర్మాలను వివరించే ప్రక్రియను రేడియోగ్రఫీ అని , ఆ రంగంలో కృషి చేసే నిపుణులను రేడి యోగ్రాఫర్స్ అని పిలుస్తారు .

రేడియేషన్ సహాయంతో రోగ నిర్థారణ మరియు ఆధునిక ఆరోగ్య పరిరక్షణ చేయడంతో అనేక అనారోగ్యాలను సునాయాసంగా నయం చేయడం జరుగుతున్నది . రేడియేషన్ సహాయంతో వైద్యం చేసే విభా గంగా రేడియాలజీకి నేడు మంచి గుర్తింపు ఉన్నది . రేడియాలజీలో ఎక్స్ రే కిరణాలు , యంఆర్ఎ స్కాన్ , అల్ట్రా సౌండ్ , సిటీ స్కాన్ లాంటి పలు సాంకేతిక పరికరాలను వినియోగించి రోగ నిర్ధారణ చేయడం జరుగుతున్నది . 08 నవంబర్ 2012 నుండి రేడియాలజీ సంఘాలు ‘ అంతర్జా తీయ రేడియోలజీ దినం ‘ కూడా నిర్వహించుట జరుగుచు న్నది . ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త వెలూమ్ రాంటిజెన్ జర్మ నీలో 27 మార్చి 1845 న జన్మిం చి , విద్యాభ్యాసం జర్మనీ , నెదర్లాండ్లో కొనసాగింది .

Facts about X-ray ::

1865 లో స్విట్జర్లాండ్ లో పాలి టెక్నిక్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు . 1869 లో పిహెచ్డ్ పట్టాను పొందిన రాంటిజెన్ , తరువాత తన గురువుతో కలిసి పరిశోధనలు కొనసాగించారు . 1895 లో కాథోడ్ కిరణాల ధర్మాలను శోధిస్తూనే , 08 నవం బర్ 1895 న విప్లవాత్మక నూతన వికిరణాలను అనుకో కుండా కనుగొనడం జరిగింది . రాంటిజెన్ గమనించిన ఆ A కొత్త వికిరణాల స్వభావ స్వరూపాలు తెలియని కారణంగా వాటిని X వికిరణాలుగా ( గణితంలో తెలియని రాశిని X అన్నట్లు ) నామకరణం చేశాడు . అనేక ఘన పదార్థాల నుండి చొచ్చుకొని పోగలిగే శక్తివంతమైన ఎక్స్ కిరణాలు , మానవశ రీరం నుండి కూడా చొచ్చుకొని పోతూ , వ్యక్తి ఎముకల చిత్రాన్ని ప్రదర్శించ గలగడం అద్భుత ఆవిష్కరణ గా నిలిచి పోయింది .

ప్రప్రథమంగా 27 డిసెంబర్ 1895 న రాంటిజెన్ సతీమణి బెర్తా చేతి ఎక్స్ రేను తీయడం ఓ భవిష్యత్తు ప్రభంజ నానికి నాంది పలికింది . ఈ అత్యద్భుత ఆవిష్కరణను గుర్తించి 1901 లో భౌతికశాస్త్ర నోబెల్ బహుమతిని రాంటిజె ను ప్రదానం చేయడం జరిగింది . రాంటిజెన్ 78 వ యేట 10 ఫిబ్రవరి 1923 న పెద్ద ప్రేగు క్యాన్సర్ తో కన్ను మూశారు . ప్రస్తుత రేడియాలజీకి నాందిగా ఎక్స్ రే వికిరణాల ఆవిష్కరణ నిలిచింది .

రాంటిజెన్ కృషికి అబ్బుర పడిన శాస్త్ర విజ్ఞాన సమాజం పరమాణు సంఖ్య 111 కలిగిన రసాయన మూల కానికి ‘ రాంటిజెనియమ్’గా నామకరణం చేసింది . రేడియేషన్ ప్రభావ ప్రమాణాలు , చంద్రమండల క్రేటర్ , అంటార్కిటికా పర్వతానికి కూడా రాంటిజెన్ పేరు పెట్టడం ద్వారా అతని విశేష కృషిని గుర్తించినట్లు అయ్యింది . వైద్యరంగంలో విస్తారంగా వినియోగించే ఎక్స్ రే కిరణాలకు అధికంగా లోనైతే శరీరానికి ప్రమాదకారిగా కూడా పరిణమి స్తుంది .125 సంవత్సరాల క్రితం రాంటిజెన్ కనుగొన్న ఎక్స్ కి రణాలు నేటికీ వైద్యరంగంలో రోగ నిర్ధారణ ప్రక్రియలో ప్రధా నమైన ఉపకరణంగా ఉపయోగపడుతున్నవి . రాంటిజెన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జీవితం నేటి యువ శాస్త్రవే త్తలకు ఆదర్శం కావాలని ఆశిద్దాం .

Related Articles

Back to top button