మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, Corona second wave

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా విజృంభణ కొనసా గుతుంది . Corona second wave ప్రజలు కొవిడ్ నిబంధనలు సరిగా పాటించకోవడం , నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం డడం వల్లే కేసులు తగ్గుముఖం పట్టం లేదని పలువురు పేర్కొంటున్నారు . గత కొన్ని రోజుల నుంచి నిత్యం 40 వేలకు పైగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి . ఇక దేశంలో మొత్తం కేసుల సంఖ్య 93.51 లక్షలకు చేరింది . కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 87.59 లక్షలుగా ఉంది . శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,322 మందికి వైరస్ సోకింది . మొత్తం కేసుల సంఖ్య 93,51,109 కి చేరింది . ఒక్క రోజు వ్యవధిలో మరో మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు . ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,36,200 కు పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది .

మర ణాల రేటు 1.46 శాతంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది . కొవిడ్ 19 తో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారేనని కేంద్ర ఆరో గ్యశాఖ స్పష్టం చేస్తుంది . గత 24 గంటల్లో 41,452 మంది కరోనా నుంచి కోలుకున్నారు . కొత్త రికవరీలతో కలిపి శనివారం ఉదయం నాటికి 87,59,969 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు . జాతీయ రికవరీ రేటు 93.68 శాతానికి పెరిగంది . గత మూడు రోజులుగా రికవరీ కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండగా , తాజాగా రికవరీ కేసులు అధికమయ్యాయి . ప్రస్తుతం దేశంలో 4,54,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి . మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 4.87 శాతమని మంత్రి త్వశాఖ పేర్కొంది .

Corona second wave

భారత్ లో ఆగస్టు 7 న కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా , ఆగస్టు 23 నాటికి 30 లక్షలు , సెప్టెం బర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకోగా , సెప్టెం బర్ 16 నాటికి 50 లక్షలు , సెప్టెంబర్ 28 న ఆ సంఖ్య 60 లక్షలు దాటింది . అక్టోబర్ 11 నాటికి 70 లక్షలు , అక్టోబర్ 29 నాటికి 80 లక్షలు దాటాయి . ఇక నవంబర్ 20 న 90 లక్షల మ్కాను దాటాయి . అయితే దేశంలో లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం పట్టగా , అవి 59 రోజుల్లో 10 లక్ష లకు చేరాయి . దేశంలో ఇప్పటివరకు 13.82 కోట్ల శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తి చేసి నట్లు భారత వైద్య పరిశోధనా మండలి ( ఐసి ఎంఆర్ ) వెల్లడించింది . శుక్రవారం 11,57,605 పరీక్షలు నిర్వహించినట్లు తెలి పింది .

కొత్తగా సంభవించిన 485 మరణాల్లో ఢిల్లీలో 98 , మహారాష్ట్రలో 85 మంది మృతి చెందారు . పశ్చిమ బెంగాల్ లో 46 , ఉత్తరప్రదే ( 23 , కేరళలో 23 , పంజాలో 27 మంది , హర్యానాలో 29 మంది మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది . దేశంలో కరోనా కార ణంగా ఇప్పటి వరకు 1,36,200 మంది బలి కాగా , ఒక్క మహారాష్ట్రలోనే 46,898 మంది మృత్యువాత పడ్డారు . అదే విధంగా కర్నాట కలో 11,738 , తమిళనాడులో 11,681 , ఢిల్లీలో 8,909 , పశ్చిమ బెంగాల్ లో 8,270 , ఉత్తరప్రదేశ్ లో 7,697 , , ఆంధ్రప్రదేశ్ లో 6,976 , పంజాబ్లో 4,737 , గుజరాత్ లో 3,938 , మధ్యప్రదేశ్ లో 3,224 మంది కొవిడ్ కారణంగా మృతి చెందినట్లు మంత్రిత్వ శాఖ గణాంకాల ద్వారా వెల్లడయింది . కాగా , ఇటీ వలి కాలంగా ఢిల్లీ అధికం సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూడగా , మళ్లీ మహారాష్ట్రలో కొవిడ్ ఉధృతి పెరిగింది . గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 6,185 కేసులు , ఢిల్లీలో 5,482 , కేరళలో 3,966 , పశ్చిమ బెంగాల్ లో 3,489 ఉత్తరప్రదేశ్ లో 2,298 కేసులు నమోద య్యాయి .

Related Articles

Back to top button