ఈ 30 కే టార్గెట్ ఇచ్చిన మంచిర్యాల కలెక్టర్, Mancherial collector sets target

మంచిర్యాల Mancherial collector sets target  జిల్లాలోని మండలాల పరి ధిలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు సంబంధం చి మండల ప్రత్యేక అధికారులకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాలను ఈ నెల 20 వ తేదీలోగా 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు . శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాతితో కలిగి జిల్లా అధికారులు , మందల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ అధికారులు పనుల పురోగతిపై ఎప్పటి కప్పుడు గ్రామపంచాయ తీ కార్యదర్శుల ద్వారా తెలుసు కోవాలని , జిల్లాలో చేపట్టిన రైతు వేదికలు రైతు కణాలలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు .

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య  నిర్వహణ , మరుగుదొడ్లు , డంపింగ్ యార్డు ,  ఇతరత్రా పనుల పురోగతి సైనతస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. Mancherial collector set target సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భా గంగా మండల స్థాయిలో పల్లెల్లో వనాలు , , మొక్కలు నాటే కార్యక్రమలక్ష్యాలను త్వరగా పూర్తి చేయడంతో పాటు అందుకు  అవసరమైన మొక్కలను నర్సరీలలో పెంచి సిద్ధంగా ఉంచడంతో పాటు వచ్చే సంవత్సరానికి సంబంధిత శాఖల సమన్వయంతో |నర్సరీలలో మొక్కల పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు . మండల ప్రత్యేక అధికారులు మండల , గ్రామ పంచాయతీల వారిగా అభివృద్ధి కార్యక్రమాల కోసం భూములను గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో ఎలాంటి వ్యత్యాసా లు లేకుండా నమోదు చేయాలని తెలిపారు .

మండలంలో రెండు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు గాను భూమిని గుర్తించిన వివరాజుతో పాటు మొక్కల పెంపకం , బయో ఫెన్సింగ్ ఏర్పాటు వైకుంఠధామం స్మశానవాటిక ) నిర్దేశిత లక్ష్యాలు ఏ మేరకు పూర్తిచే యబడినవి వివరాలతో పాటు మండల స్థాయిలో ప్రత్యేక అధికా రులు ఆయా సంబంధిత శాఖల సమన్వయంతో చేయాలని అధికా రులను ఆదేశించారు . గ్రామాల స్థాయిలో పారిశుద్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్కరాచెత్త , మురుగునీరు నిల్వ ఈ అడకుండా చూసేలా ఏర్పాటు చేయాలని అన్నారు . ఈ కార్యక్రము లలో మంచిర్యాల , బెల్లంపల్లి  మండల అధికారులు రమేష్ | బ్యామలాదేవి , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి , జిల్లా పంచాయతీ అధికారి నారాయణు , ప్రత్యేక అధికారులు , సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Related Articles

Back to top button