హైదరాబాద్ లో దారుణం, Gang rape in Hyderabad
హైదరాబాద్ నగరంలో మరో దారుణం హైదరాబాద్ లో దారుణం, Gang rape in Hyderabad బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకుని నగ్న చిత్రాలు సేకరించిన శివకుమార్ వాటిని అడ్డం పెట్టుకుని తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు . ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి ఓ యువకుడు తన ముగ్గురు స్నేహితుల సాయంతో ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు .
హైదరాబాద్ లో దారుణం, Gang rape in Hyderabad :
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు . మహ్మగూడకు చెందిన బాలిక ( 14 ) సీతాఫల్ మండి బీదల బస్తీకి చెందిన శివకుమార్ ( 23 ) తో కొంత కాలంగా ప్రేమాయణం కొనసాగి స్తోంది . బాలి కను అనేక సార్లు బయటకు తీసుకెళ్లిన శివకుమార్ ఆమె నగ్న చిత్రాలను తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు . వాటిని అడ్డం పెట్టుకుని ఏడాదిగా ఆమెను వేధిస్తున్నాడు . వారం రోజుల క్రితం శివకుమార్‌తో పాటు అతడి ముగ్గురు స్నేహితులు బాలికను బెదిరించారు . తాము చెప్పిన చోటికి వస్తే నగ్న చిత్రాలను డిలీట్ చేస్తామని నమ్మించారు . ఆ మాటలు నమ్మినబాలికవారి వెంట ఓయూ పరిధి లోనూ ఓ పాత భవనానికి వెళ్లింది . అక్కడ నలుగురు కామాంధులు ఆమెను బెది రించి సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆ దారుణాన్ని వీడియో తీశారు . ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరిం చారు . తర్వాతి రోజు బాలిక అనా రోగ్యానికి గురికావడంతో ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడగ్గా జరిగిన విషయాన్ని చెప్పింది . దీంతో వారు రెండ్రోజుల క్రితం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నలుగురిని అరెస్టు చేశారు . నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కి తరలించారు .