స్కూల్ కి వెళ్లే బాలికను గర్భవతిని చేసిన యువకుడు, boy cheated a girl

boy cheated a girl మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేశాడు ఓ ప్రబుద్ధుడు . ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . పోలీసులు , బాధితులు తెలిపిన వివరాల ప్రకారం .. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ( 14 ) స్థానిక ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి పూర్తి చేసింది . అదే గ్రామానికి చెందిన శవ్వ మహేశ్ ఏడాదిగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు . స్కూల్ కు , కిరాణానికి వెళ్లే సమయంలో వేధించేవాడు . మాట్లాడకుంటే చంపేస్తానని బెదిరించి , ఏడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడాడు .

boy cheated a girl ::

 ఆ బాలిక ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి . ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వాళ్ల అమ్మమ్మ ఇంటికి పంపించాడు . రెండు నెలల తర్వాత తిరిగి వచ్చేసరికి మహేశ్ కు మరో అమ్మాయితో ఆగస్టులో వివాహం జరిగినట్టు తెలిసి బాలిక అతడిని ప్రశ్నించింది . ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి తననూ పెండ్లి చేసుకుంటానని , ముందు అబార్షన్ చేయించుకోవాలని నమ్మించి 18 న ఓ ప్రయివేటు క్లినిక్ ను సంప్రదించారు . అబార్షన్ వీలు కాకపోవడంతో ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లారు . అయితే బాలిక తల్లి గమనించి ఆమెను ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది . బాలికను పెండ్లి చేసుకొని తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబసభ్యులు , బంధువులు మహేశ్ ఇంటి ఎదుట టెంట్ వేసి నిరసన చేపట్టారు . బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్టు సిఐ సైదులు తెలిపారు .

Related Articles

Back to top button