కేసిఆర్ పై బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు, vikramarka comments on KCR

ఫార్మాసిటీ వ్యవహారాన్ని పెద్ద బ్రోకరేజ్ వ్యవస్థలో కెసిఆర్ ప్రభుత్వం మార్చిందని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ఆరోపించారు . vikramarka comments on KCR కెసిఆర్ ఒక ముఖ్యమంత్రిలా కాకుండా భూముల బ్రోకర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు . సోమవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు . ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ చేస్తోందన్నారు . దళితులకు మూడు ఎకరాలు పంచుతామని హామీలు ఇచ్చిన సీఎం , ఇప్పుడు దళిత , గిరిజన , పేద వర్గాలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచిన భూములను అక్రమంగా లొక్కొంటున్నారని దుయ్యబట్టారు . ఫార్మాసిటీ పేరుతో 6 గ్రామాల్లోని దాదాపు 8 వేల దళిత , గిరిజన , పేదల భూములను కెసిఆర్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకొంటోందని భట్టి విమర్శించారు .

vikramarka comments on KCR ::

 ప్రజాప్రయోజనాల కోసం అంటే నాగార్జున సాగర్ , శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టుల కోసం లేదా ప్రభుత్వమే నిర్మించే బిహెచ్ఎల్ , ఇసిఐఎల్ వంటి భారీ పరిశ్రమల కోసం భూములు సేకరించడం తప్పుకాదని , కేవలం ఒక దళారీగా మారి భూములను రైతులనుంచి అక్రమంగా సేకరించడం నేరమని అన్నారు . ఫార్మాసిటీ పేరుతో పేద రైతుల భూములను అమెరికా సంస్థలకో , మల్టీనేషనల్ కంపెనీలకో కట్ట పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు . బహుళజాతి సంస్థలకు భూములు ధారాదత్తం చేయడం ప్రజాప్రయోజనం ఎలా అవుతాయని భట్టి ప్రశ్నించారు . ఫార్మాసిటీ రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాలతో పాటు హైదరాబాద్ పరిసరాలు కూడా పూర్తిగా కలుషితం అవుతాయన్నారు . ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి లాక్కొంటున్న భూముల్లో అసైన్డ్ భూములు వివరాలను భట్టి వెల్లడించారు . మేడేపల్లి గ్రామంలో వెయ్యికి పైగా , తాటిపర్తిలో 752 , కురుమిద్ద గ్రామంలో 1222 , కందుకూరు మండలం ముచ్చెర్ల గ్రామంలో 2,382 , మీర్ ఖాన్ పేటలో 1083 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని అన్నారు . పేదలకు ఎకరాకు రూ .8 లక్షలు ఇచ్చి , ఆయన మాత్రం రూ.కోటీ 50 లక్షలకు అమ్మకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు .

సామాజిక తెలంగాణ కోసమే కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని , ఇలా భూములను బహుళజాతి సంస్థల కోసం కాదని ఆయన అన్నారు . ప్రజలకు సంబంధించిన భూములను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు . సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ లో 2.40 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉండగా కేవలం 3,428 మత్రమే కట్టారని భట్టి అన్నారు . 2016 గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ అధికారింగా విడుదల చేసిన మేనిఫెస్టోను పార్టీ వెబ్ సైట్ నుంచి తీసేశారని విమర్శించారు . ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే మేనిఫోస్టో తొలగించాల్సిన అవసరమేంటని భట్టి ప్రశ్నించారు .

Related Articles

Back to top button