శానిటైజరు తాగి 11మంది మృతి, Sanitizer killed 11 people
శానిటైజర్ తాగి 11 మంది మృతి ఒంగోలు , ప్రకాశంజిల్లాల్లో విషాద ఛాయలు అలు ముకున్నాయి . Sanitizer killed 11 people మద్యం ధరలు పెరిగిపోవడంతో మద్యానికి బానిసలైన కొందరు శానిటేజర్లను తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర కలకలం రేపింది .
కురిచేడు లో 11 మంది మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది . మృతుల్లో ముగురు బిక్షాటకులు కాగా , ఎనిమిది మంది గ్రామస్తులు కావడం గమనార్హం . శానిటేజరులో 60 శాతం అల్కాహాల్ ఉంటుందని , తాగితే హానికరం కాదని , నిషాగా ఉంటుందనే ఉద్దేశంతో వారంతా గత పది రోజులుగా శానిటైజరులో కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది . అయితే పది రోజులుగా శానిటైజరు తాగుతున్నా .. ఏమికాకపోవ డంతో .. గురువారం రాత్రి అధిక మొతాదులో శానిటైజరును కలుపుకొని తాగినట్లు తెలుస్తోంది .
Sanitizer killed 11 people ::
స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయం వద్ద శానిటైజరు తాగిన ముగ్గురు యాచకుల్లో ఒక్కరు కడుపులో మంటగా ఉందని , అక్కడే మృతి చెందగా , మరో ఇద్దరుఅపస్మారక స్థితిలోకి వెళ్లారు . దీంతో వారిని 108 వాహనంలో దర్శి ప్రభుత్వ వైద్య శాలకు తరలించగా శుక్రవారం ఉదయం మృతి చెందారు . గ్రామస్తులు కూడా రాత్రి పూట కూల్ డ్రింక్ లో శానిటైజరును కలుపుకొని తాగడంతో వారు మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు . కరోనా దృష్యా కురిచేడులో గత పదిరోజు లుగా మద్యం దుకాణాలు మూతపడంతో కొందరు స్థానికులు , యాచకులు శానిటైజర్లను తాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు . మృతి చెందిన వారిలో అనుగొండ శ్రీనుబోయ ( 25 ) భోగెం తిరుపతయ్య ( 37 ) , గుంటక రామిరెడ్డి ( 60 ) కడియం రమణయ్య ( 30 ) , కనగిరి రమణయ్య ( 65 ) , రాజారెడ్డి ( 65 ) , బాబు ( 40 ) , చార్లెస్ ( 45 ) , బాబు ( 45 ) , అగస్టీన్ ( 47 ) , ఎస్ స్ సైదా ( 25 ) లుగా గుర్తించారు .