Trending

మంట కలిసిన మానవత్వం. Covid patient last rights

 కరోనాతో మృతి చెందిందని అపోహతో అంత్యక్రియలకు ముందుకు రాని గ్రామస్తులు, పీపీఈ కిట్టు ధరించి తల్లి మృతదేహానికి అంత్యక్రియలు. Covid patient last rights

నిజామాబాద్ జిల్లా , ఆర్మూర్ మండలం గోవింద్ పేట్లో కరోనా వైరతో తలారి సత్తెమ్మ మృతి చెందిందని అపోహ పడి గ్రామస్థులు ఎవరు రాకపోవడంతో కుమారుడు పీపీఈ కిట్టు ధరించి మంగళవారం దహన సంస్కారాలు చేశారు . వివరాలు ఇలా ఉన్నాయి . గోవింద్ లోని తలారి సత్తెమ్మ కుమారుడికి నాలుగు రోజుల కిందట కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాడు . ఇతను వ్యవసాయం చేసి జీవిస్తాడు . వారి కుటుంబంలోని భార్య , పిల్లలు , తండ్రికి పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చింది . అయితే అనారోగ్యంతో బాధపడుతున్న సత్తెమ్మ మంగళవారం మృతి చెందింది . సత్తెమ్మ కరోనాతో మృతి చెందిందనే అనుమానంతో గ్రామస్థులు మృతదేహాన్ని ముట్టుకోలేదు . దారిదాపులలోకి రాలేదు . అంత్యక్రియలకు ఎవరు హాజరు కాలేదు . దీంతో ఉప సర్పంచ్ బండమీది గంగాధర్ చొరవ తీసుకొని గ్రామానికి చెందిన జేసీబీ వేరే గ్రామంలో ఉండడంతో అద్దెకు మాట్లాడి రప్పించాడు . చివరికి కరోనా పాజిటివ్ ఉన్న కుమారుడు తల్లి మృతదేహాన్ని ఎత్తుకొని జేసీబీ బకెట్లో పడుకోబెట్టాడు . ఇంటి నుంచి జేసీబీ బయలుదేరగా కుమారుడు , ఉప సర్పంచ్ బండమీది గంగాధర్ , టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అప్పాల గణేష్ , ఆశావర్కర్లు స్మశానవాటికకు వచ్చారు .

Covid patient last rights ::

 ఉప సర్పంచ్ గంగాధర్ దగ్గరుండి దహన సంస్కారాలు చేయించారు . అనారోగ్యంతో మృతి చెందినా కరోనా వైరతో చనిపోయిం దని అపోహ పడి అంత్యక్రియాలకు ఎవరు హాజరు కాకపోవడాన్ని చూస్తే మానవత్వం మంటకలుస్తుందని పలువురు పేర్కొన్నారు . కన్న తల్లి మృతదేహాన్ని పీపీ కిట్టు ధరించి జేసీబీలో పడుకోబెట్టడం చూసిన కుటుంబీకులు కన్నీటి పర్యాంతమయ్యారు . గ్రామ మహిళలు కంటతడి పెట్టారు . మృతురాలికి ఒక కుమారుడు , ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు

Related Articles

Back to top button