మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా, TRS MLA tests Corona positive
TRS MLA tests Corona positive ఎమ్మెల్యేకు పాజిటివ్ హైదరాబాద్ , కరోనా బారిన మరో అధికార పార్టీ ఎమ్మెల్యేపడ్డారు . సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్‌కు పాజిటివ్ నిర్ధారణ అయింది . ఇప్పటికే తెరాసకు చెందిన నిజామాబాద్ అర్బన్ , రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్త , బాజిరెడ్డి గోవర్ధన్ , జనగామ TRS MLA tests Corona positive ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి , ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గొంగిడి సునీత , హోం మంత్రి మహమూర్ఎలీతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వీ . హనుమంతరావు , గూడూరు నారాయ ణరెడ్డి , బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే .
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో మమేకమైన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా తేలడంతో హోం క్వారంటైన్లో ఉన్నారు .
వరంగల్ మేయరు కరోనా???
ఉన్నతాధికారులను , ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తాజాగా వరంగల్ మేయర్‌ను తాకింది . మేయర్ గుండా ప్రకాశ్ , ఆయన సతీమణికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది . ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ ఏ మూల నుంచి వస్తుందో తెలియక అంతా కలవరపడుతున్నారు . ఈ క్రమంలో మేయర్ దంపతులకు కరోనా రావడం స్థానికంగా అలజడి రేపుతోంది . దీంతో నగర రాజకీయ నేతలు ముఖ్యంగా మేయర్ తో సన్నిహితంగా ఉన్న వారిలో ఆందోళల నెలకొంది . దీంతో వరంగల్ మేయర్ దంపతుల తో పాటు గన్‌మెన్ , ఇతర సిబ్బంది హోం క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు .
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ పమేలా సత్పతి , పలువురు కార్పొరేటర్లు కూడా క్వారంటైన్ లో ఉన్నారు . గత 15 రోజులుగా మేయర్ తో కలిసి ఉండి , సన్నిహితంగా మెలిగిన నేతలు , కార్యకర్తలు పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు వారికి సూచించా రు . అయితే మేయర్ దంపతులు ఎక్కడ వైద్యం తీసుకుంటున్నారనే విషయం తెలియాల్సి ఉంది .