తెలంగాణ సర్కార్ కు హై కోర్టు హెచ్చరిక, Highcourt serious on TS govt
తెలంగాణ రాష్ట్ర సర్కారు పై హై కోర్టు మరోసారి ఘరం అయింది. Highcourt serious on TS govt కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్లో సమగ్ర వివరాలు ఉండాలని మరోమారు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది . కరోనా పరీక్షలు , పడకలు , బులిటెన్ తదితర అంశాలపై సోమవారం హైకోర్టు లో సుదీర్ఘ విచారణ జరిగింది .
ఈ నెల 28 న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికోర్టుకు హాజరు కావాలని తాఖీదులు జారీచేసింది . తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెబ్ సైట్ ను పునరుద్ధరించాలని కోరింది . కోర్టు ఆదేశాలు అమలు కాకపోతే చర్యలు తప్పవని , కోర్టు సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చ రించింది . ప్రభుత్వం రోజూ విడుదల చేస్తున్న కరోనా బులిటెన్లో సమగ్ర వివరాలు ఉండేలా చూడాలని సూచించింది . జిల్లాల వారీగా కరోనా పరీక్షలకు సంబం ధించి ఆయా జిల్లా కలెక్టర్లు వివరాలు వెల్లడించాలని ఆదేశించింది . ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలను , ర్యాపిడ్ టెస్టు కేంద్రాల వివరాలను వెల్లడించాలని సూచించింది .
ఫిర్యాదుల కోసం ఏర్పా టు చేసిన వాట్సప్ నంబర్‌ను విస్తృత ప్రచారం చేయా లని ఆదేశించింది . ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు మరిన్ని ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలని కోరింది . వివాహాలు , అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలని ఆదేశాలు సూచించింది . కరోనా నియంత్రణకు ప్రభుత్వం , అధికారులు రాజ్యాంగ బద్ధమైన విధిని నిర్వహించాలని ఈ విషయాన్ని విస్మరించరాదని హైకోర్టు పేర్కొంది . హైకోర్టు ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది . అధికారులపై కేసు పెట్టి సస్పెండ్ చేయాలని హైకోర్టు ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని అడిగింది .
Highcourt serious on TS govt ::
పదేపదే ఆదేశిస్తున్నప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఒక్క తీర్పు కూడా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది . కరోనా పరీక్షలు , సమాచారం వెల్లడి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన హైకోర్టు ఢిల్లీ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వం వెనకబడి ఉందని వ్యాఖ్యానించింది . కరోనాపై విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్లో సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది . ఆస్పత్రుల వారీగా పడకలు , వెంటి లేటర్ల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది . అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు దాచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది . సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొంది .
కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ రోజూ విడుదల చేస్తున్న బులిటెన్లో తమ చర్యలను హైకోర్టు అభినందించిందని ప్రస్తావించడంపై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది . ఓవైపు మొట్టికాయలు వేస్తుంటే అభినందించినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించింది . ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో దీని ద్వారానే అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది .