ఎమ్మెల్యే పై దేశ ద్రోహం కేసు నమోదు, AIDUF MLA arrested .

 కరోనా వైరస్ నివారణలో భాగంగా అస్సోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారం టైన్ కేంద్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆల్ ఇండియా యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ( AIDUF MLA arrested ) కుచెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంను దేశద్రోహ నేరంకింద పోలీసులు మంగళవారం అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీ కి తరలించారు.

 క్వాంరంటైన్ కేంద్రాలలో తల్లిగీ జమాత్ లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ముస్లింల పట్ల వైద్యాధి కారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని , ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా నిర్బంధంగా ఇంజన్లు ఇస్తున్నారని ఆరోపిస్తూ AIDUF MLA arrested మరోవ్యక్తితో కలిసి ఎమ్మెల్యే విడుదల చేసిన ఆడియో క్లిప్ ఒకటి వాట్స్ ఆప్లో వైరల్ అయింది.

 అదేవిధంగా బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని గౌహతి స్టేడియం , మకేషిత్ కేంద్రాలలో నిర్వహిస్తున్న క్వారం టైన్ కేంద్రాలలో ముస్లింలపట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు .

 క్వారం టైన్ కేంద్రాలు నిర్బంధ కేంద్రాలని , చాలా ప్రమాదకరమైనవని అని పేర్కొన్నట్లు తెలిసింది . భారత్ లో నమోదైన కరోనా కేసులలో 1 / 3 ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తల్లిగీ మత ప్రార్థనలకు హాజరైన ముస్లింలనేని అందులో ఆరోపించారు .

  వాట్స్ అప్ లో విడుదల చేసిన క్లిప్ లొ గొంతుతనదేనని , విడుదల చేసింది తనేనని , ఒప్పుకున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు . ఎమ్మెల్యే మొబైలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఈ మేరకు వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసి జుడిషియల్ కస్టడికి తరలించినట్లు రాష్ట్ర డిజిపిభాస్కర్ జ్యోతి మహంతా పేర్కొన్నారు . ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు .

Related Articles

Back to top button