కరోనావైరస్ సోకకుండా ఆల్కహాల్ త్రాగి 44 మంది మృతి. Do alcohol kill coronavirus?
కరోనావైరస్ సోకకుండా ఉండడానిక సోషల్ మీడియా లో వచ్చిన వార్తా Do alcohol kill coronavirus? కథనం ప్రకారం ఇరాన్ లో కొంత మంది ఆల్కహాల్ తీసుకునే ప్రయత్నంలో కనీసం 44 మంది ఆల్కహాల్ పాయిజన్‌తో మరణించారని, వందలాది మంది బూట్లెగ్ ( కల్లు) ఆల్కహాల్ తీసుకున్న తరువాత ఆసుపత్రి పాలయ్యారని ఇరాన్ మీడియా తెలిపింది..
మిడిల్ ఈస్ట్ లో కరోనావైరస్ కారణంగా మరణించిన వారిలో ఎక్కువ మంది ఇరాన్‌లోనే ఉన్నారు.
మద్యం సేవించడం వల్ల కరోనావైరస్ నయం లేదా నిరోధించవచ్చని దేశవ్యాప్తంగా ఒక తప్పుడు పుకారు వ్యాపించింది. వదంతులను కొంత మంది నమ్మి ఆల్కహాల్ తీసుకోవడం తో మరణించారు, దీన్ని నివారించేందుకు దేశంలో మద్యం సేవించడం నిషేధించబడింది అని ఇరాన్ మీడియా తెలిపింది.
స్థానిక మీడియా క్రమం తప్పకుండా బూట్లెగ్ ( లోకల్ కల్లు) మద్యం వల్ల కలిగే విషం యొక్క ప్రాణాంతక కేసులపై నివేదిస్తుంది. ఖుజెస్తాన్ రాజధాని అహ్వాజ్‌లోని జుండిషాపూర్ వైద్య విశ్వవిద్యాలయం ప్రతినిధి మాట్లాడుతూ 218 మంది విషం తాగి అక్కడ ఆసుపత్రి పాలయ్యారు అని తెలిపారు.
“కరోనావైరస్ చికిత్సలో ఆల్కహాల్ తాగడం ప్రభావవంతంగా ఉంటుందనే పుకార్ల వల్ల ఈ ఘటన సంభవించింది” అని అలీ ఎహ్సాన్‌పూర్ చెప్పారు.
ఆల్కహాల్ తీసుకోవడం Do alcohol kill coronavirus? వల్ల కరోనా వైరస్ చావదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే స్పష్టం చేసింది.
మీ శరీరమంతా ఆల్కహాల్ లేదా క్లోరిన్ చల్లడం వల్ల మీ శరీరంలోకి ప్రవేశించిన వైరస్లను చంపలేరు. అటువంటి పదార్థాలను చల్లడం బట్టలు లేదా శ్లేష్మ పొరలకు (అంటే కళ్ళు, నోరు) హానికరం. ఉపరితలాలను క్రిమిసంహారక చేయడానికి ఆల్కహాల్ మరియు క్లోరిన్ రెండూ ఉపయోగపడతాయని తెలుసుకోండి, అయితే అవి తగిన సిఫారసుల క్రింద ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
One Comment