భూమి పట్ట అప్లై చేసేముందు ఇది తెలుసుకోండి…!

భూమి యాజమాన్యపు హక్కు పత్రం , పట్టాదారు పాసుపుస్తకం ఉంటేనే వ్యవసాయ భూమిపై హక్కులు అనుభవించవచ్చు . సాగుదారుగా పొందాల్సిన లబ్దిపొందవచ్చు . భూమి ఏవిదంగా వచ్చినా పట్టా పాసుపుస్తకాలు పొందవలసిందే . కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి పట్టా పాసుపుస్తకాలు పొందాలంటే భారత రిజిస్ట్రేషన్ చట్టం , 1908 ప్రకారం కొనుగోలు పత్రాల / దస్తావేజుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి . రిజిస్ట్రేషన్ చేయించుకోనట్లయితే , భూమి హక్కులు మరియు పట్టాదారు పాసుపుస్తకాల చట్టం , 1971 ( ఆర్.ఓ.ఆర్ చట్టం ) ప్రకారం రెవెన్యూ రికార్డులలో కొనుగోలు చేసిన వ్యక్తిని పట్టాదారుగా నమోదు చేయరు .

భూమి యాజమాన్యపు హక్కు పత్రం , పట్టాదారు పాసుపుస్తకం జరీచెయ్యరు . కానీ , వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన చాలా మంది కొనుగోలు దస్తావేజులను / పత్రాలను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు . రిజిష్టర్ కానీ దస్తా వేజులు లేదా సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేస్తే పట్టా రాదు . ఆ కాగితాలు కోర్టులలో హక్కుల నిరూపణకు ఆధారాలుగా చెల్లవు . పట్టా పాసుపుస్తకాలు లేక భూయజమానిగా , సాగుదారుగా ఎలాంటి లబ్ది పొందలేక పోతున్నారు .

రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా చేసిన కొనుగోలును అన్ రిజిష్టర్ / సాదా బైనామా కొనుగోలు అంటారు . ఆ విధంగా వ్రాసుకున్న భూమి కొనుగోలు పత్రాలను రిజిష్టర్ కానీ దస్తా వేజులు / అన్ రిజిష్టర్డ్ దస్తావేజులు / సాదా బైనామాలు అంటారు . రిజిష్టర్ కాని భూమి కొనుగోళ్లను క్రమబద్దీకరించి పట్టా పాసుపుస్తకాలు జారీ చెయ్యడానికి ఆర్ఓఆర్ చట్టంలో సెక్షన్ 5 – ఎ ను చేర్చడం జరిగింది . ఈ సెక్షన్ ప్రకారం తహసీల్దార్కు రిజిష్టర్ కాని దస్తా వేజులు / సాదా బైనామాలను క్రమబద్దీకరించే అధికారం కల్పించారు . తహసీల్దార్ 13 బి . సర్టిఫికెట్ జరీ చేస్తే రిజిష్టర్ కాని దస్తా వేజుల / సాదా బైనామాలకు రిజిష్టర్డ్ దస్తావేజుకు ఉన్న విలువ వస్తుంది . భూమి యాజమాన్యపు హక్కు పత్రం , పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయవచ్చు .

ఆర్డీఆర్ చట్టం , 1971 లోని సెక్షన్ 5 – ఎ , ఆర్జేఆర్ రూల్స్ , 1989 లోని రూల్ 22 ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఫారం -10 లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి 13 బి సర్టిఫికెట్ జారీ చేసి పట్టా పాసుపుస్తకాలు ఇస్తారు . 13 బి సర్టిఫికెట్ పొందాలంటే భూమి కొనుగోలు 31 డిసెంబర్ 2000 కంటే ముందు జరిగి ఉండాలి . ఇటీవల ప్రభుత్వం ఈ తేదీని 2 జూన్ 2014 కు మార్చింది . అంటే , 2 జూన్ 2014 వరకు రిజిష్టర్ కాని దస్తావేజులు / సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమికి 13 బి సర్టిఫికెట్ పొందవచ్చు . దరఖాస్తు గడువు 2009 లోనే ముగిసిపోయింది . ఇప్పుడు మరలా ప్రభుత్వం దరఖాస్తు గడువును 5 ఆగస్టు 2018 వరకు పొడిగించింది . గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని 2 జూన్ 2014 కంటే ముందు కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులు 5 ఆగస్టు 2018 లోపు దరఖాస్తు చేసుకుంటే 13 బి సర్టిఫికెట్ పొంది , పట్టా పాసుపుస్తకాలు పొందవచ్చు . అయిదు ఎకరాల లోపు చేసిన కొనుగోలుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫారం -10 దరఖాస్తుల స్వీకరణకు 45 రోజులు గడువు ఇస్తూ , 31 డిసెంబర్ 2000 నుండి 2 జూన్ 2014 మధ్యకాలంలో కొనుగోలు చేసిన వారికి కూడా క్రమబద్దీకరణకు అవకాశం కల్పిస్తూ , అయిదు ఎకరాలలోపు కొనుగోలుకు ఫీజు మాఫీ చేస్తూ 21 జూన్ 2018 నాడు ఉత్తర్వులు జారీచేసింది .

రిజిష్టర్ కాని దస్తావేజుల / సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఇప్పటి వరకు జరీచేసిన ఉత్తర్వులు…

Back to top button