బెల్లంపల్లి లో అటకెక్కిన ఉపాధి హామి పధకం

తేదీ* 23-04-2022రోజున మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామము లో ఉపాధి హామి పథకం క్రింద పేద ప్రజలకు అందవలసిన ఖజానాను గ్రామ సర్పంచ్ గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన పేరు మీద జాబ్ కార్ఢ్ తీసుకోని తను పనికి వెల్లకుండానే తన పేరు మీద ఉపాధిహామి రోజువారి కూలీ డబ్బులు తీసుకుంటున్నాడాన్ని ఇలాంటి అవినీతి సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా MPDO రాజేందర్ గారి దగ్గరకు ఫిర్యాదు ఇవ్వడానికి ఈరోజు ఉదయం 11 గంటలకు భారతీయ జనతాపార్టీ బెల్లంపల్లి మండల శాఖ ఆద్వర్యంలో రావడం జరిగింది. MPDO గారు తన కార్యాలయంలో లేకుండా ఎన్ని సార్లు తన అధికారిక నంబర్ కి కాల్ చేసిన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం కూడా మా నాయకులు కార్యాలయానికి వస్తే ఛాంబర్ కి రాకుండా కాంప్లేంట్ తీసుకోను అక్కడ కార్యాలయంలో పడేసి పో అని దురుసుగా మాట్లాడి మీరు పిచ్చోల్లు నేను తెరాస వాల్లకే పని చేస్తాను అని సమాధానం ఇచ్చాడు.

ఇప్పటికీ మండలంలో జరుగుతున్న అవినీతి పై ఎన్ని కాంప్లేయిట్స్ ఇచ్చిన పట్టించుకోకుండా ఒక ఉన్నతస్థాయి అధికారి అవినీతికిపరుడిలా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి MPDO ను వెంటనే సస్పెండ్ చెయ్యాలి. ఎంపీడీఓ రాజేందర్ అడ్డదారిలో తన సొంత మండలంలో పోస్టింగ్ తెచ్చుకోని ప్రజలపై ఆజమాసి చలాయిస్తున్నాడు.ఎన్నిసార్లు వెళ్లి కలిసిన తన నివాసంలో ఉండి విధులు నిర్వహించడం విడ్డురంగా ఉంది.

సమస్యలకోసం వెళ్తే సమస్యలు వినకుండా మొబైల్ ఫోన్లో ఆటలూ ఆడుతూ కాలయాపన చేస్తున్నాడు.ఈ MPDO స్థానికుడు కావడంతో స్థానికనాయకుల అండదండలతో MPDO ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి MPDO ని విధులనుంచి తొలగించాలని లేని యెడల భారతీయ జనతాపార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుడిమే విజయ్ కుమార్ మండల నాయకులు గజెల్లి రాజ్ కుమార్ ముత్తె రామన్న నస్పూరి లక్షణ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button