Trending

కేసిఆర్ లో ఈ మార్పు ఎందుకు.! Why KCR changed his mind

Why KCR changed his mind 2021 సంవత్సరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలి వ్యవహార తీరు లో మార్పు కనిపించే అవకాశం ఉందా అని చూస్తున్న వారికి , ఈ మధ్య జరిగిన సంఘటనలు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి . రెండోసారి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గా కెసిఆర్ ప్రతి విషయంలో కాస్త కఠినంగానే ఉంటున్నారు . ముఖ్యంగా ఆర్టీసీ పై ఆయన వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు లోనయింది . అసలు కార్మికులు ఏంది సమయం లో సమ్మె , ఆర్టీసీ ఎందుకు అన్న విధంగా ఆయన ధోరణి కొనసాగింది . అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఇప్పుడే ఆర్టీసీ మళ్లీ గాడిలో పడుతుంది అంతేకాకుండా రెవెన్యూ సిబ్బంది విషయంలో రెవెన్యూ శాఖలో జరిగిన అవినీతిపై జరుగుతున్న అవకతవకలపై అగ్గిమీద గుగ్గిలం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు .

అంతేకాకుండా రెవెన్యూ , రిజిస్ట్రేషన్ల శాఖలో 2020 సంవత్సరం లో పలు మార్పులు చేశారు . ఈ మార్పుల లో కొన్ని సత్ఫలితాలనిస్తుంది . కొన్ని కొత్త సమస్యలను తెచ్చి పెడుతున్నాయి . ఉదాహరణకు ధరణీ పోర్టల్ , ఉద్యోగుల తాత్కాలిక భృతి , విషయంలో పాధ్యాయ , ఉద్యోగ వర్గాల నుండే కాక , ప్రజల నుంచి నాయకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు . అంతే కాకుండా రాజకీయంగా ఏ రోజు ఎదురు లేని ముఖ్య మంత్రి కేసీఆర్ , దుబ్బాకలో ఎమ్మెల్యే సీటు జారవిడుచుకున్నారు . అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేవలం 56 సీట్లు గెలిచి , గత ఎన్నికల కంటే తక్కువ పర్ఫామెన్స్ ను నమోదు చేసుకున్నారు . ఇలాంటి విషయాలే కాకుండా , ఉద్యోగుల పట్ల కూడా వారి సమస్యలు అయినా పరిష్కరించకపోవడం వల్ల ఎంతో వ్యతిరేకత ఏర్పడింది .

Why KCR changed his mind ::

ఇది అందరికీ తెలిసిన విషయమే . టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తారకరామారావు కు పార్టీ పగ్గాలతో పాటు , పూర్తిస్థాయిలో ప్రభుత్వ బాధ్యతలు అప్పజెప్పి తను ఎక్కువశాతం ఫామ్ హౌస్ కె పరిమితం కావడం కూడా పలు విమర్శలకు తావిచ్చింది . ఇక కేంద్ర విధానాల విషయంలో ఇక్కడ వ్యతిరేకిస్తూ , ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నారనే విమర్శలకు తావిచ్చారు . ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉండడం రోజురోజుకు ప్రజల్లో టిఆర్ఎస్ పట్ల , కెసిఆర్ వ్యవహారశైలి పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతున్నట్టు , ఆ వ్యతిరేకతను దినదినం పెరుగుతున్నట్టు ఆయన తెలుసుకున్నట్లుగానే ఆయన వ్యవహారం మారుతుంది . ఆ కారణంగా , నూతన సంవత్సరంలో కెసిఆర్ ప్రభుత్వ పరంగా ప్రజలతో వ్యవహరించే తీరులో ఉద్యోగుల పట్ల విధానాల పట్ల వ్యతిరేకించే తీరులో సానుకూలతో కూడిన స్పష్టమైన మార్పు కనిపిస్తుంది . ఉదాహరణకు నూతన సంవత్సరానికి ముందే , ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పే కమిషన్‌ను అమలు చేయడంతో పాటు ఉద్యోగ విరమణ వయసును పెంచడం , ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం శుభ పరిణామంగా భావిస్తున్నారు . ఇందుకు సంబంధించి 2021 సంవత్సరం ప్రారంభానికి ముందే , ఉద్యోగులతో చర్చలు ప్రారంభించడం ఆయనపై నమ్మకం ని పెంచే విషయంగా పలువురు భావిస్తున్నారు .

ఇక పార్టీ పరంగా నామినేటెడ్ పోస్టులను , పార్టీ వర్గాల నుంచి భర్తీ చేయడానికి కూడా ఆయన త్వరలోనే కసరత్తు చేపట్టే అవకాశం ఉంది . అలాగే కేంద్రంతో కూడా సానుకూలంగా వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాలను పరిష్కరించే దిశగా కేసీఆర్ అడుగులు వేసే అవకాశం ఉంది . ఇక రైతుల విషయంలో నూతన సాగు చట్టాలు వద్దని తొలుత చెప్పిన కేసీఆర్ , ఇప్పుడు ఆ సాగు చట్టాల లోని పలు అంశాలను అమలు చేసే విధంగా మార్గాలు వెతుకుతున్నారు 2020 సంవత్సరం వర్షాకాలం సీజన్ లో నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేసి రైతుల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు .

అలాగే మక్కల కొనుగోలు కొనుగోలు ఇతర పంటల కొనుగోలులో ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చిందని అందువల్ల రైతులు ఇప్పుడు తమకు ఇష్టం వచ్చిన పంటను వేసుకుని ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చని ప్రకటించారు . అయితే మళ్లీ పంటలు పండి అమ్ముకునే స్థితికి వచ్చేసరికి ఆయన విధానంలో ఏం మార్పు ఉంటుందో , ఎవరూ చెప్పలేని పరిస్థితి . అలాగే రాజకీయంగా కూడా నూతన సంవత్సరంలో కెసిఆర్ ఢిల్లీ కి వెళ్లి , కేటీఆర్‌ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండ పెట్టె అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది అలాగే జరిగితే టిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి గళంగా భావించే హరీష్ రావును కేటీఆర్ స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసే అవకాశం ఉంది . ఇలా కేసీఆర్ 2021 సంవత్సరంలో ప్రజలకు అనుకూలమైన రీతిలో వ్యవహరించే స్పష్టమైన అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి .

Related Articles

Back to top button