కేసిఆర్, బండి సంజయ్ పై రేవంత్ రెడ్డి ఘటు వ్యాఖ్యలు, Revanth reddy comments
Revanth reddy comments సిఎం కెసిఆర్ , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లు తెలంగాణ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని , ఇద్దరు కలిసి ఎంఐఎంను ఆటవస్తువుగా మార్చుకున్నారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు . టిఆర్ఎస్ , ఎంఐఎం , బిజెపిలు ఒకే ఎజెండాతో పని చేస్తున్నాయని , కాంగ్రెస్ ను బలహీనం చేసేం దుకు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయని అన్నారు .
‘ బస్తీ హమారా .. బల్దియా హమారా ‘ అనే నినాదంతో తాము జిహెచ్ఎంసి ఎన్ని కలలో పోరాడుతామని చెప్పారు . గాంధీభవన్లో మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి అధికారంలోకి రావడానికి ఎంఐఎం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు . అందుకు టిఆర్ఎస్ సమన్వయం చేస్తోందని , బీహార్ లో అదే జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు . ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ జైలుకు వెళ్తే బెయిల్ ఇప్పించింది . బిజెపి నేత రఘునందన్ అని , బిజెపి , ఎంఐఎంలది తెర ముందు కుస్తీ , తెర వెనుక దోస్తీ అని అన్నారు . ఒకవైపు కెసిఆర్ ఆత్మ అయిన జూపల్లి రామేశ్వర్ రావ్ మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని బిజెపి ఎంపి అరవింద్ ఫిర్యాదులు చేశారని , మరోవైపు అదే రామేశ్వర్ రావ్ , ఆయన కొడుకును వెంటబెట్టుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ లో కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి ని చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నార న్నారు .
Revanth reddy comments ::
బిజెపికి నిజాయితీ ఉంటే వాళ్ళు చెప్తున్న సిద్ధాంతాలు వాళ్ళు నమ్మితే రఘునందన్ రావ్ , కిషన్ రెడ్డి లను పార్టీ నుంచి సస్పెండ్ చేయా లని ఆయన డిమాండ్ చేశారు . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , అసదుద్దీన్ సఖ్య తగా ఉన్న వీడియోను , రామేశ్వర్ రావ్ ను పార్లమెంటులో మంత్రుల వద్దకు కిషన్ రెడ్డి తీసుకెళ్ళిన ఫోటోను ఈ రేవంత్ రెడ్డి మీడియా సమా వేశంలో విడుదల చేశారు . కిషన్ రెడ్డి ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగిం చాలన్నారు . మోదీ విధానాలను మేం తప్పని చెబితే కెసిఆర్ వారికి మద్దతు ఇచ్చారని , ఈఎస్ఎ , సహారా కుంభకోణాల్లో సిబిఐ కేసులలో ఉన్న కెసిఆర్ ను కాపాడుతుంది బిజెపియేనని అన్నారు .
తన సంతకాన్ని ఫోర్జరీ చేసారని బండి సంజయ్ అంటున్నారని , ఇక్కడే కేంద్ర హోం శాఖ మంత్రి ఉన్న కిష న్ రెడ్డి నేరుగా చర్యలు తీసుకోకుండా ఎందుకు నాన్చుతుందన్నారు.బండి సంజయ్ కి భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఉన్న నమ్మకం కిషన్ రెడ్డి మీద లేదా అని ప్రశ్నించారు . ఎంఐఎం కు టిఆర్ఎస్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటున్న బిజెపి విచారణకు ఎందుకు ఆదేశించడం లేదన్నారు . బిజెపి , టిఆర్ఎస్ , ఎంఐఎం మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ పై పోరాటం చేస్తున్నాయని , టిఆర్ఎస్ , బిజెపి పార్టీలకు వెళ్ళిన చాలా మంది బడా నాయకులు కనీసం ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి కూడా లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నారన్నారు .