TRS కు మరో షాక్, flood relief aid stopped
వరద సాయం పంపిణీని రాష్ట్ర ఎన్నికల సంఘం flood relief aid stopped నిలిపివేయడంతో అధి కార తెరాస పార్టీకి పెద్ద షాక్ తగిలింది . తమకు వరద సా యం పంపిణీ చేయలేదంటూ ప్రభుత్వాన్ని తిట్టు కుంటూ తిరిగి వెళ్లారు . దీంతో జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు ప్రజలు తెరాస పార్టీకి చుక్కలు చూపించారు . ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ప్రకటించిన రూ .10 వేల తక్షణ ఆర్థిక సహాయం పంపిణీ ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది . బాధితు లకు సరిగ్గా పంపిణీ జరగకపోగా , పంపిణీ చేసిన మొత్తంలో కొంత మొత్తాన్ని తెరాస పార్టీ నేతలు , కార్యక ర్తలు దిగమింగారని ఆరోపణలు రావడంతో ఆ పంపిణీ ని తాత్కాలికంగా ఆపివేసిన ప్రభుత్వం అర్హులైన బాధితు లు అంతా ఆన్ లైన్లో మీ సేవా ద్వారా దరఖాస్తు చేసు కోవాలని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది .
ఈ ప్రకట న తీవ్ర గందరగళానికి దారితీసింది . గత రెండు రోజులు గా మీ సేవా కేంద్రాల వద్ద బాధితులు రూ .10 వేల ఆర్థిక స హాయం కోసం దరఖాస్తులు చేసుకునేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు . ఒక్కో మీ సేవా కేంద్రం వద్ద బా రులు తీరి నిలబడ్డారు . కొన్ని చోట్ల తోసుకున్నారు . ము ఖ్యంగా మహిళలు , వృద్ధులు తమ పిల్లలను తీసుకుని మ రీ వచ్చి మీ సేవా కేంద్రాలు తెరవకముందే పెద్ద ఎత్తున గుమిగూడారు . దీంతో కొన్ని చోట్ల కంప్యూటర్లు పని చేయకపోవడం , మరికొన్ని చోట్ల కరెంట్ లేకపోవడం , ఇంటర్నెట్ పని చేయకపోవడం వంటి సమస్యలు తలెత్త డంతో దరఖాస్తు దారులు తీవ్ర ఆందోళన చెందారు .
వందల సంఖ్యలో వచ్చిన దరఖాస్తుదారులు దరఖాస్తులు చేతబట్టుకుని క్యూ లైన్లలో నిలబడ్డారు . పది వేల సా యం వస్తుందో రాదో తెలియదు కానీ , దరఖాస్తు చేసేం దుకు ఇబ్బందులు పడుతున్నామని లైన్లో నిలబడ్డ వా రు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు . ఇంటింటికీ పంపిణీ చేసినప్పుడు తమను విస్మరించారని , కావాలని స్థానిక రాజకీయ నాయకులు తమకు ఆర్థిక సాయం అందించ లేదని తెరాస ప్రభుత్వ పైనా , ఆ పార్టీ నేతలపైనా దుమ్మె త్తిపోశారు . నిజమైన బాధితులకు సహాయం అందించలే దని ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు .
flood relief aid stopped ::
ఆర్థిక సహాయం పంపిణీ నిలిపివేసిన ఎన్నికల సంఘం తీవ్ర గందరగోళానికి గురైన రూ .10 వేల వరదల సహాయం పంపిణీ గురించి ఉదయం నుంచి అన్ని టివి చానళ్లలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి దరఖాస్తుల స్వీకరణ , పంపిణీని బుధవారం నిలిపివేసింది . ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ పథకాన్ని యధాతథంగా కొనసా గించుకోవచ్చునని ప్రకటించింది . జిహెచ్ఎంసి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిబంధనలను అతిక్రమించి నట్లు అవుతుందని స్పష్టం చేస్తూ ఆర్థిక సాయం పంపి ణీని ఆపాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదే శించింది . మీ సేవా కేంద్రాల వద్ద లబ్దిదారులు పెద్ద ఎ త్తున గుమిగూడడం , ఎన్నికలకు ముందు అనవసర గ ందరగోళానికి దారితీసే పరిస్థితులు ఉన్నందున ఈ కా ర్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించ డంతో బాధితుల వివరాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్లో తాత్కాలికంగా స్వీకరణ నిలిపివేసినట్లు సమాధానం రావడంతో సర్వర్ ఆగిపోయింది . దీంతో చాలా చోట్ల లబ్దిదారులు తిట్టుకుంటూ తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు .