GHMC ఎన్నికల సర్వేలో పాల్గొనండి, GHMC polls online survey 2020

GHMC polls online survey 2020 రాజకీయమంటేనే ఎత్తులు . జిత్తులు , ఎదుటి పక్షాలను బురిడీ కొట్టించడం .. ఆత్మరక్షణలో పడేట్లు చేయడం .. ఇందులో ఏ పార్టీ అయినా రాటుదేలాల్సిందే . సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది . మడి కట్టుకుని …. సిద్దాంతాలు వల్లిస్తూ రాజకీయాలు నడపే రోజులు పోయాయి . అవతలి వారు ఒకటి అంటే నాలుగు అనేట్లుగా ఉండాలి . చెంప చెల్లుమనేలా విమర్శలు గుప్పించాలి . వారు గుక్కతిప్పుకోకుండా చేయాలి . ప్రజల్లో ఎదుటివారి ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడాలి . వారు సమాధానం చెప్పుకోలేని ఆత్మరక్షణలో పడేలా చేయాలి .

ఇప్పుడు గ్రేటర్ లో అదే పద్ధతిని ఎంచుకుంది . బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక దూకుడు మొదుల పెట్టారు . వరద బాధితులకు సాయానికి సంబంధించిన లేఖతో బిజెపిని ఇరుకున పెట్టాలని చూసిన టీఆర్ఎస్ను కుడితిలో పడ్డ ఎలుకలా చేశారు . ఇకపోతే టీఆర్ఎస్ తొలి , మలిసారి అధికారంలోకి వచ్చాక చేరికలతో ఎదుటి పక్షాలను లేకుండా చేసుకోవాలన్న ఆలోచన చేసింది . ఇందులో కాంగ్రెస్ ను దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది . ప్రతిపక్షం అన్నది లేకుండా చేసుకుంది . మీడియా కూడా సైలెంట్ అయ్యింది . ఇలా టీఆర్ఎస్ అనుసరించిన అదే తోవలో ఇప్పుడు బిజెపి నడుస్తోంది . హైదరాబాద్ లో రెండంకెల సీట్లతో బిజెపి గట్టి పోటీని మాత్రం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి . అందుకే ఎదుటి పార్టీల వారిని చేర్చుకోవడం ద్వారా తన బలాన్ని , గళాన్ని పెంచుకోవాలని సంజయ్ బండి లాగుతున్నారు . ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అటూఇటూ దూకడం షరా మామూలే . అదీ అధికార పార్టీలోకి దూకుతారు . కానీ ఇక్కడ విచిత్రంగా విపక్ష పార్టీ కూడా కాని బిజెపిలోకి బడాబడా నేతలు క్యూ కడుతున్నా రన్న ప్రచారం సైలెంట్ గా సాగుతోంది . అలాంటి సందేశాన్ని ఇప్పుడు ఇస్తున్నారు , సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన నాయకులు .. అధికారం అటు ఇటు కాగానే జెండా మార్చేస్తుంటారు .

GHMC polls online survey 2020 ::

[IT_EPOLL id=”6920″][/IT_EPOLL]

Related Articles

2 Comments

  1. GHMC ఎన్నికలు – 2020 ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదు. మొత్తం అధికార దుర్వినియోగం జరిగింది. సోషల్ మీడియా వల్ల వాస్తవాలు ప్రజలు చూడగలిగారు.

    బాపట్ల కృష్ణమోహన్
    prajasankalpam@gmail.com
    @Praja_Snklpm (ట్విట్టర్)
    prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
    prajasankalpam1 (యూట్యూబ్)

    https://prajasankalpam1.blogspot.com/

Back to top button