Trending

సక్రి చావుకు కారణం ఎవరూ, Sakri murder mystery

నాటుసారా కాస్తుందనే కారణంతో అడవిదేవులపల్లి మండలం ఉల్సాయి పాలెం గ్రామానికి చెందిన కేతావత్ Sakri murder mystery విచారణ పేరుతో నల్లగొండకు అడవిదేవులపల్లి ఎస్సై తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడం వల్లనే చనిపోయిందని , సక్రి మరణంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ , రాష్ట్ర ఎస్సీ , ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అఖిల పక్షం , ప్రజా సంఘాలు స్పష్టం చేశాయి . మంగళ వారం స్థానిక అమరవీరుల స్థూపం వద్ద బాధితురాలు సక్రి కుటుంబ సభ్యుల పరిరక్షణ కమిటీ పేరుతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ్ నాయక్ అధ్యక్షత వహించారు .

ఈ సందర్భంగా పలు వురు నాయకులు మాట్లాడుతూ అడవిదేవులపల్లి ఎస్సై అక్కడి వైన్స్ దుకాణదారులతో కలిసి సక్రి ఇంటిపై దాడి చేశారని , అందుకు సంబంధిత ఎస్సై , వైన్స్ షాపు నిర్వాహకులు బాధ్యత వహించాలన్నారు . ఎలాంటి మహిళా పోలీసుల రక్షణ లేకుండా సక్రిని నల్లగొండకు తీసుకెళ్లి విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టడం వల్లనే మరణించిందని నాయకులు పేర్కొన్నారు . సక్రి మరణానికి కారకులైన అడవిదేవులపల్లి పోలీసు సిబ్బందిపై ఐపిసి 302 , 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు . బాధిత కుటుంబ సభ్యులు ఎస్సీ , ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా .. పోలీసులు పట్టించుకోలే దన్నారు . ఈ విషయమై జాతీయ ఎస్సీ , ఎస్టీ కమిష తో పాటు , రాష్ట్ర డిజిపి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలి పారు .

Sakri murder mystery ::

సక్రి కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు , ఐదెకరాల వ్యవసాయ భూమి , వారి కుటుం బంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు . సక్రి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని , దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను సన్నా హక కమిటీని ఏర్పాటు చేశారు . కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.మల్లేశ్ , బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జి సాథినేని శ్రీనివాసరావు , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ , కాంగ్రెస్ పట్టణా ధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి , కిసాన్ మోర్చా నాయకులు సీతారాంరెడ్డి , గిరిజన సంఘం రాష్ట్ర అధ్య క్షులు డి.రవినాయక్ , కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నాగా ర్జున , బిజెపి జిల్లా కార్యదర్శి బి.రతన్ సింగ్ నాయక్ , ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య , డివై ఎస్ఇ జిల్లా అధ్యక్షులు రవినాయక్ , బిసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పరమేష్ , వెంకయ్య , విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మారం శ్రీనివాస్ , యువజన విభాగం అధ్యక్షులు సిద్ధు నాయక్ , కెవిపిఎస్ నాయకులు పరుశురాములు , యాదవ సంఘం నాయకులు మురళియాదవ్ , ఎమ్మా ర్పీఎస్ జిల్లా నాయకులు మడుపు శ్రీనివాస్ , ఏడుకొం డలు , బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు మళ్లా నాయక్ పాల్గొన్నారు .

Related Articles

Back to top button